ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ అన్నారు. తాజాగా.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ గురించి మాట్లాడిన యూసుఫ్.. విరాట్ ప్రతిభ గురించి విశ్లేషించారు.
ఈ తరంలో క్రికెట్ అంటే ప్రాక్టీసే అని చెప్పారు. నిరంతర సాధన ఆటగాడిని మరో స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. ఈ ప్రాక్టీస్ ద్వారా తమ పొరపాట్లను సరిదిద్దుకొని, ఉత్తమమైన ఆటను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక, ఇప్పటి కుర్రాళ్లు ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు యూసుఫ్.
విరాట్ గురించి మాట్లాడుతూ.. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. ఈ తరంలో నంబర్ వన్ బ్యాట్స్ మెన్ అంటే కోహ్లీనే అని చెప్పారు యూసుఫ్. అతను వన్డేలు, టెస్టులు కలిపి 70 అంతర్జాతీయ శతకాలు చేశాడు. వన్డేల్లో 12 వేలు, టెస్టుల్లో 10 వేల పరుగులకు దగ్గరగా ఉన్నాడని, కోహ్లీ ప్రదర్శన నమ్మశక్యం కాకుండా ఉందన్నారు.
అయితే.. ఇప్పటి వరకూ తాను కోహ్లీ ప్రాక్టీస్ చూడలేదన్నారు. సోషల్ మీడియాలోనే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసినట్టు చెప్పారు. కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనలో అతని ఫిట్ నెస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు యూసుప్.
పాకిస్థాన్ నిన్నటి తరం ఆటగాళ్లలో యూసుఫ్ కీలకమైన వాడు. అతను పాక్ తరపున 98 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. టీ20 కొత్తల్లోనే రిటైర్మెంట్ ప్రకటించిన అతను 3 మ్యాచులు మాత్రమే ఆడాడు. పాకిస్థాన్ అందుకున్న ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో యూసుఫ్ పాత్ర ఉంది.