దేశాల మధ్య అడ్డుగోడలతో క్రీడలకు సంబంధం లేదనుకున్నాడా క్రికెట్ లవర్. క్రికెట్ పై అభిమానం, కోహ్లీ పై అభిమానం ఎక్కువై ఓ పాకిస్థాన్ యువకుడు భారత పతాకాన్ని తన ఇంటిపై ఎగరవేశాడు.. ఇంకేముంది పోలీసులొచ్చి ఆయన్ను అరెస్టు చేశారు.
విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఒక పాకిస్థాన్ కు చెందిన ఉమర్ డ్రాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏమిటంటే విరాట్ కోహ్లీ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటేందుకు త్రివర్ణ పతాకాన్ని చేతబూనడమే. పంజాబ్ ప్రావిన్స్ లోని ఒకరా జిల్లాకు చెందిన ఉమర్ డ్రాజ్ తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడన్న ఫిర్యాదుపై అతని ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచగా కోర్టు పోలీసు కస్టడీకి రిమాండ్ చేసింది. తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమనీ, తన ఇంటిపై త్రివర్ణ పతాకం ఉండటం ఆ భారత క్రికెటర్ పట్ల తన అభిమానాన్ని చాటేందుకేనని ఉమర్ డ్రాజ్ విలేకరులకు చెప్పారు. ఉమర్ డ్రాజ్ ఇంటిలో గోడల నిండా విరాట్ కోహ్లీ పోస్టర్లు ఉన్నాయి.
మంగళవారం ఆస్ర్టేలియాపై టీ 20 మ్యాచ్ లో కోహ్లీ బ్రహ్మాండంగా ఆడి ఇండియాను గెలిపించడంతో ఆనందం తట్టుకోలేని ఉమర్ భారత జెండాను ఇంటిపై ఎగురవేసి ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. మంగళవారమే భారత గణతంత్ర దినోత్సవం కావడంతో పాకిస్థాన్ ఉమర్ చర్యను మరింత తీవ్రంగా తీసుకుంది. ఆయన్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది.