ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్. పరుగుల యంత్రంగా పేరుగాంచాడు. విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు చేశాడు. కానీ ఇప్పుడు ఫాం కోల్పోయి.. కెప్టెన్సీ కోల్పోయి.. కనీసం ఆటగాడిగా కూడా రాణించడం లేదు. సెంచరీలు చేయక చాలా కాలమైంది. ఆ పరుగుల యంత్రం సొమ్మసిల్లిపోయింది. రిటైర్ మెంట్ తీసుకోకుండా ఆడుతున్న విరాట్ కోహ్లీ తీరుపై విమర్శల వాన కురుస్తోంది.
ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విమర్శలతోపాటు సానుభూతి సందేశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కు మద్దతుగా నిలబడిన ప్రముఖుల్లో టీమిండియా సారథి రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు.
ఇక కోహ్లీని టార్గెట్ చేస్తున్న వారికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సైతం తాజాగా తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు.ఫామ్ కష్టాలు త్వరలో సమసిపోతాయని.. ధైర్యంగా ఉండు అంటూ ‘బాబర్ అజాం ట్వీట్ చేశారు.
బాబర్ ట్వీట్ పై కోహ్లీ కొద్దిసేపటి క్రితమే స్పందించాడు. ‘థ్యాంక్యూ.. నువ్వు ఇలాగే రాణిస్తూ.. ఎదుగుతూ ఉండాలి.. ఆల్ ది బెస్ట్ బాబర్’ అంటూ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక బాబర్ ట్వీట్ పై విరాట్ కోహ్లీ స్పందించాల్సి ఉండిందని షాహిద్ ఆఫ్రిది ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కోహ్లీ స్పందించాలని షాహిద్ అఫ్రిది ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కోహ్లీ ఈ రిప్లై ఇవ్వడం విశేషం.
కెరీర్ ఆరంభంలో బాబర్ అజామ్ తన ఆరాధ్య గురువుగా ‘విరాట్ కోహ్లీని’ పేర్కొన్నాడు. తనకు రోల్ మోడల్ అని ప్రకటించాడు. ప్రస్తుతం బాబర్ ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ కోహ్లీనే తన ఆరాధ్య క్రికెటర్ గా పేర్కొంటున్నాడు.
కోహ్లీ బ్యాటింగ్ చూస్తూనే తాను ఎదిగానంటూ బాబర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. బాబర్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడు. టీ20, వన్డే ఫార్మాట్ లో ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. కోహ్లీ మాత్రం ఫాం కోల్పోయి దుర్భర స్థితిలో ఉన్నాడు.