కోహ్లీ.. రోహిత్​ శర్మ వివాదం ముదిరిందా? ఇదే సాక్ష్యం

Update: 2020-11-06 07:50 GMT
భారత జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ మధ్య కోల్డ్​వార్​ నడుస్తున్నదా.. ఆసిస్​ టూర్​ కు రోహిత్​కు చోటు దక్కకపోవడానికి విరాటే కారణమా?  తనకు పోటీకి వస్తాడని రోహిత్​ను కోహ్లీ దూరం పెడుతున్నాడా? కొంత కాలంగా క్రికెట్​ అభిమానులను తొలిచివేస్తున్న ప్రశ్నలివి. వీళ్లిద్దరి మధ్య వివాదం ముదురుతున్నదంటూ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటివరకు ఒకరినొకరు కలిపి మొత్తం 7 సార్లు రన్ ఔట్ చేసుకున్నారు. అప్పటినుంచి ఈ తరహా వార్తలు ప్రారంభమయ్యాయి. సోషల్​ మీడియాలో ఇరు క్రికెటర్ల అభిమానులు పోటాపోటీ పోస్టింగ్​లు పెట్టుకొనే  స్థాయికి వెళ్లిపోయారు. గతేడాది ప్రపంచకప్ లో సెమీ ఫైనల్ కు ముందు భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే  ఆ రోజు బ్యాటింగ్ ఆర్డర్ కు సంబంధించి విరాట్ తీసుకున్న నిర్ణయం రోహిత్ కు నచ్చలేదని టాక్​. అప్పటి నుంచే కెప్టెన్ కు వైస్ కెప్టెన్ కు మధ్య వివాదం నడుస్తోందనే టాక్ ఉంది.

అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీ ముగియగానే భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కాగా వన్డేలు, ట్వంటీలు, టెస్టులకు ఇలా మూడు ఫార్మాట్లకు సెలెక్టర్లు  రోహిత్ ను ఎంపిక చేయలేదు. దీని  వెనుక విరాట్ హస్తం ఉన్నట్లు వార్తలు రావడంతో... వీరి మధ్య ఉన్న వివాదం రాజుకుంటున్నట్లు తెలిసింది. దీనికి తోడు నిన్న జరిగిన ఓ ఘటన అనుమానాలను మరింత పెంచింది. గురువారం విరాట్​ కోహ్లీ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, క్రికెట్​ అభిమానులు, బాలీవుడ్ స్టార్లు కోహ్లీకి బర్త్ డే విషెస్​ తెలిపారు. కానీ రోహిత్​ శర్మ మాత్రం విషెస్​ చెప్పలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఏప్రిల్ 30న రోహిత్ బర్త్ డే కు కోహ్లీ ట్విట్ చేసాడు. కానీ ఇప్పుడు రోహిత్ చేయలేదు. దీంతో వివాదం నిజమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News