భారత్ పై వైరస్ ఎఫెక్ట్ ..మరో రెండు నెలల్లో ..!

Update: 2020-05-24 00:30 GMT
భారత్‌ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,654 వైరస్ కేసులు నమోదవగా, 137 మంది వైరస్ తో మృతి చెందారు. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరగా, ఇప్పటి వరకు 3,720 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసులు 69,597 ఉండగా, 51,784 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. భారత్‌ లో వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 41.39గా ఉంది. కాగా, భారత్‌ లో  వైరస్ పై అమెరికా సైంటిస్టులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాబోయే మరో రెండు నెలల్లో దేశంలో వైరస్ ఉగ్రరూపం దాల్చనుందని అమెరికాకు చెందిన మేరీల్యాండ్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ ఫహీమ్‌ యూనస్‌ వెల్లడించారు. ఈ  వైరస్‌ గురించి ప్రజల్లో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ..రాబోయే రోజుల్లో ఏదేశంలో వైరస్ ఎలా ఉంటుందో వివరించారు. తాజాగా సైంటిస్ట్‌ ఫహీమ్‌ ఇండియా, పాకిస్తాన్‌ లలో కరోనా వైరస్‌ పంజా విసరనున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్చి నెల నుంచి భారతదేశంలో వైరస్ కేసులపై ఫహీమ్‌ సర్వే నిర్వహించారు.

ఈ సర్వే ఆధారంగా ఆగస్ట్‌ 4 నాటికి భారత్‌ లో 34,155 వైరస్ మరణాలు, ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి దాయాది దేశం పాకిస్తాన్‌ వైరస్  మరణాలపై నిర్వహించిన సర్వేలో ఆగస్ట్‌ 4నాటికి 5,332మంది మరణిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఫహీమ్‌ తన స్టేట్మెంట్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరణాలపై కొంతమంది నాయకులు, ప్రజలు ద్వేషించవచ్చు. కానీ కరోనా మాత్రం రెండు దేశాల్ని సమానంగా ప్రేమిస్తుందని సైంటిస్ట్‌ ఫహీమ్‌ యూనస్‌ ట్వీట్‌ చేసారు.
Tags:    

Similar News