కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ కరోనా మహమ్మారి దెబ్బకి గజగజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందనే అంచనాలను తాజాగా పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మాస్టాయిడ్ ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని కొత్త పరిశోధన తేల్చింది.
కరోనాతో మరణించిన రోగులపై హెడ్ అండ్ నెక్ శస్త్రచికిత్స విభాగం నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ముగ్గురుపై చేసిన ఓ అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరల్ లోడ్లు ఉన‍్నట్టు గుర్తించారు. కరోనా తో ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత రోగుల మరణానికి ముందు వారి నమూనాలను సేకరించి ఈ పరిశోధన నిర్వహించినట్టు వెల్లడించారు.
ఇప్పటి వరకు ముక్కు, గొంతు, ద్వారా ఊపిరితిత్తుల లోకి పాకుతుందని అందరికీ తెలుసు. తాజాగా చెవిలోని ప్రధాన భాగమైన మస్టాయిడ్ ప్రాంతంలో వైరస్ ను తాజాగా గుర్తించారు. 80 ఏళ్ల మహిళకు కుడి మధ్య చెవిలో మాత్రమే వైరస్ రాగా, 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ, కుడి కర్ణబేరిలోనూ, ఎడమ,కుడి మధ్య చెవులలో వైరస్ ను గుర్తించామని తెలిపారు. కరోనా వైరస్ చెవి ఇన్ఫెక్షన్లు లేదా చెవి సమస్యలతో ముడిపడి ఉందని వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్, 2020 నాటి ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలను కనుగొన్నారు.