విజయవాడలో చోటు చేసుకున్న ఒక దారుణ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. విశాఖపట్నానికి చెందిన 47 ఏళ్ల పీతల అప్పలరాజు అలియాస్ రాజు హత్యకు గురైన వైనం బయటకు వచ్చి షాకింగ్ గా మారుతోంది. దసరా పండక్కి విశాఖపట్నానికి వచ్చిన ఆయన ఐదు రోజుల క్రితమే విజయవాడకు రావటం.. అంతలోనే హత్యకు గురి కావటంతో.. కారణం ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ షురూ చేశారు. అజిత్ సింగ్ నగర్ క్రిష్ణా హోటల్ కూడలిలో ఆర్ పి కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఆఫీసు నడుపుతున్న ఆయనకు ఒక భార్య.. కొడుకు.. కూమార్తె ఉన్నారు.
ఈ ఆగస్టులోనే కుమార్తె రేష్మకు పెళ్లి చేశారు. తాను విజయవాడలో ఉంటూ.. కుటుంబాన్ని విశాఖలో ఉంచిన ఆయన మధ్య మధ్యలో వచ్చి వెళుతుంటారు. ప్రేమ వివాహం చేసుకున్న అప్పలరాజు.. మూడేళ్ల క్రితం విశాఖలోని ఎంవీపీ కాలనీలో స్థిరపడ్డారు. అప్పలరాజు ఫోన్ లిఫ్టు చేయకపోవటంతో.. అతడి వద్ద పని చేసే వెంకటేశ్ అనే వ్యక్తి.. మరో ఉద్యోగి అయిన సాయి కుమార్ కు చెప్పటం..అతడు ఇంటికి వెళ్లి చూడగా.. బిల్డర్ ను హత్య చేసిన ఉదంతాన్ని గుర్తించారు.
ఏపీలోని రెండు నగరాల్లో సంచలనంగా మారిన బిల్డర్ అప్పలరాజు హత్య ఉదంతానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి మూడు కారణాల్ని ప్రాథమికంగా గుర్తించారు. అందులో మొదటిది తాజాగా విజయవాడ విశాలాంధ్ర కాలనీలో కొన్న ఒక స్థలం విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందని.. దాని కారణంగా ఏమైనా హత్య జరిగి ఉండి ఉండొచ్చా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. రెండో అంశం.. అతడికి వాంబే కాలనీకి చెందిన ఒక యువతితో సన్నిహిత సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ కారణంతోనే కుటుంబాన్ని విశాఖకు పరిమితం చేసి.. తాను విజయవాడలో ఉంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడో కారణం.. హత్య గురైన తర్వాత అప్పలరాజు మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు.. చేతికి ఉండాల్సిన రెండు ఉంగరాలు లేకపోవటంతో.. ఎవరైనా డబ్బుల కోసం హత్య చేశారా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు.