ప్రైవేట్ కు విశాఖ ఉక్కు .. ఉద్యమం తప్పదు - రాజీనామాలకి సిద్ధం కావాలన్న గంటా!
విశాఖపట్నం ..రాష్ట్రంలో ఉన్న సుందరమైన నగరాల్లో ఒకటి. అలాగే వైజాగ్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నలు దిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం గుర్తొస్తుంది. ఈ పోరులో ఏకంగా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవంగా విశాఖ ఉక్కు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం తప్పదా..ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్తే ఉక్కు ధరలకు అడ్డు అదుపు ఉంటాయా అని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది భవిష్యత్ తరాల కోసం చేసిన బలిదానాలు కేంద్రం ప్రభుత్వ నిర్ణయంతో గాలిలో కలిసిపోతున్నాయి. స్ట్రాటజిక్ సేల్ పేరుతో స్టీల్ ప్లాంట్ వాటాలను విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది ఈ చర్య లక్షలాది మంది జీవితాలకు శరాఘాతంగా మారుతుందనే ఆందోళన కార్మిక వర్గాల్లో మొదలైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే.. 100 రెట్లు ఉద్యమం, తీవ్రత చవి చూడాల్సి వస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఐదు కోట్ల ఆంధ్రులు, 20 కోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సమానం. ఉక్కు సంకల్పంతోనే సాధించుకున్నాం. విశాఖ ఉక్కు నుంచి విశాఖ ను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీక అంటూ ట్వీట్ చేశారు.
అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాలి. అవసరమైతే ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి అని అన్నారు.