టీడీపీ ఆఫీస్ మీద యాక్షన్ టేకెన్ బై ... ?

Update: 2022-03-08 16:52 GMT
ఏపీలోనే నంబర్ సిటీగా ఉన్న విశాఖలో  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు జప్తు నోటీసులు అంటించడం కలకలం రేపుతోంది. టీడీపీ బ్రహ్మాండమైన బిల్డింగ్ ని చాలా కాలం క్రితమే నగరం నడిబొడ్డున నిర్మించుకుంది. ఆ ఆఫీసులో నిత్యం పార్టీ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున జరుగుతాయి.

ఇక విశాఖ టీడీపీకి మహా మహులు ప్రెసిడెంట్లుగా పనిచేశారు. ఇపుడు కూడా  ఒక  అగ్ర నేత సారధిగా ఉన్నారు.  ఇక విశాఖలో సీనియర్ మోస్ట్ లీడర్లున్నారు. మాజీ మంత్రులున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికల్లో గెలిచిన నలుగురులో ముగ్గురు పార్టీతోనే ఉన్నారు.

టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ సిటీలో టీడీపీ ఆఫీస్ కి ఎందుకు జప్తు నోటీసులు వచ్చాయి అంటే కధ చాలానే ఉంది అంటున్నారు జీవీఎంసీ అధికారులు జీవీఎంసీకి ఆస్తిపన్ను కింద పెద్ద పెద్దలలో టీడీపీ ఆఫీస్ బాకీ పడిందని చెబుతున్నారు. దాన్ని కట్టకపోవడంతో జప్తు నోటీసులను ఆఫీస్ వద్ద అంటించాల్సి వచ్చింది అంటున్నారు.

ఇక విశాఖ టీడీపీ ఆఫీస్ జీవీఎంసీకి ఆస్తిపన్ను ఎంత బకాయి అంటే అక్షరాలా నాలుగు లక్షల అరవి ఆరు వేల  దాకా అని అధికారులు అంటున్నారు. ఈ బకాయి వసూలు  కోసమే కఠిన చర్యలకు దిగాల్సి వచ్చిందని కూడా చెబుతున్నారు. టీడీపీ ఆఫీస్ విశాఖలోని 28వ వార్డులో ఉంది. బహుళ అంత‌స్థులతో సకల సదుపాయాలతో పార్టీ ఆఫీస్ ఉంది. ఇది దశాబ్దాల క్రితమే నిర్మించారు.

ఇక విశాఖలో టీడీపీ రాజకీయ వైభోగం కూడా ఎంతో ఉంది. బలమైన పార్టీగా ఉంది. మరి ఆ పార్టీ ఆఫీసునకు జప్తు నోటీసులు అంటే నిజంగా నామార్దాగానే చూడాలి. ఇక దీని మీద జీవీఎంసీ జోన్ ఫోర్ కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మి అయితే బకాయిలు చెల్లించకపోతే తదుపరి చర్యలకు కూడా సిద్ధమని ప్రకటించారు.

మరి ఆ తదుపరి చర్యలు ఏంటి ఎలా ఉంటాయి అన్నది కూడా చర్చగా ఉంది. ఇంత వెలుగూ వెలిగి అన్నట్లుగా టీడీపీకి ఈ పరిస్థితి ఏంటి అన్నదే తమ్ముళ్ళ వేదనగా ఉంది. మరి జీవీఎంసీకి బకాయిలు చెల్లిస్తారా లేక ఈ విషయం మీద గడువు కోరుతూ కోర్టుకు వెళ్తారా, లేక మరింత గడువు కావాలని అభ్యర్ధిస్తారా అన్నది చూడాలి.

ఏది ఏమైనా జప్తు నోటీసులు మాత్రం వైరల్ అవుతోంది. టీడీపీ మీద రాజకీయంగా కక్ష అందులే లక్షల బకాయిలు అని సడెన్ గా నోటీసులు ఇచ్చారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ నోటీసుల విషయం ఏ కీలకమైన మలుపు తీసుకుంటుందో.
Tags:    

Similar News