విఖాఖపట్నం మరో రికార్డ్

Update: 2020-08-26 17:33 GMT
ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామన్న ప్రకటన ఆ నగరానికి ఊపును తెస్తోంది. ఇప్పటికే పర్యాటక, మౌళిక సదుపాయాలకు విశాఖ గమ్యస్థానంగా ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిన సర్వేలో విశాఖకు అద్భుతమైన స్పందన వచ్చింది.

దేశవ్యాప్తంగా అత్యంత ధనిక నగరాల్లో విశాఖ నగరం టాప్ టెన్ లో చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ప్రోగ్రామింగ్, ఫార్మాసుటికల్ ఇండస్ట్రీలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు నెలవై ఉన్న విశాఖ నగరం 26 బిలియన్ డాలర్ల జీడీపీతో దేశవ్యాప్తంగా టాప్ టెన్ నగరాల్లో చోటు దక్కించుకుంది.

ఈ సర్వేలో విశాఖపట్నంతోపాటు ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఫూణే, అహ్మదాబాద్, సూరత్ నగరాలు కూడా అత్యంత ధనిక నగరాలుగా నిలిచాయి.

ఇక భారత్ కూడా 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మూడో అతిపెద్ద ధనిక దేశంగా నిలిచిందని ఆ ప్రైవేటు సంస్థ తెలిపింది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం ఆ నగరానికి అత్యుత్తమైన అవార్డులు రానుండడంపై హర్షం వ్యక్తం చేస్తోంది.
Tags:    

Similar News