రాజకీయ ప్రయోజనాలు.. వ్యక్తిగత అవసరాలు.. వ్యాపార సంబంధమైన లావాదేవీలు అధికంగా రాజకీయ నేతలకు ప్రజాసేవకు మించిన పనులు చాలానే ఉంటాయి. ప్రజలు అభిమానించినా.. పార్టీ పెద్ద పీట వేసినా.. చేతిలో పవర్ లేకపోతే వారికి ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. ఎన్నికల్ని ధనమయంగా మార్చేసిన చంద్రబాబు లాంటి వారు రాజకీయాల్లోకి వ్యాపారవేత్తల్ని తీసుకొచ్చి పెద్దపీట వేసిన వైనం తెలిసిందే. తన రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పని చేసిన వారి కంటే కూడా ఫైనాన్స్ పరంగా సౌండ్ అయిన వారిని వెతికి మరీ తెచ్చి పెద్దపీట వేసిన దానికి చంద్రబాబు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు.
అధికారం ఉన్న వేళ బాబు అడుగులకు మడుగులు వొత్తిన వారంతా ఇప్పుడు తమ దారిన తాము చూసుకుంటూ అధినేతకు.. పార్టీకి షాకిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైన నాటి నుంచి టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్న పరిస్థితి. తాజాగా ఆ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు వెళ్లి వాలిపోయే లక్షణం ఉన్న గంటా.. తాజాగా బాబు చేతిలో పవర్ లేని నేపథ్యంలో పార్టీలో కంటిన్యూ కావటం సాధ్యం కావటం లేదంటున్నారు. జగన్ గాలి కాస్త తక్కువగా వీచిన జిల్లాల్లో విశాఖను చెప్పొచ్చు. టీడీపీకి కాసిన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చిన జిల్లాగా విశాఖను చెప్పాలి. ఇప్పడీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు గడిచిన కొంతకాలంగా పక్క చూపులు చూస్తున్నారు.
ఆయన విధేయత మీద అనుమానాలు ఉన్న జగన్.. ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. దీంతో.. సరైన అవకాశం కోసం చూస్తున్న ఆయనకు బీజేపీ మాత్రమే ఆప్షన్ మిగిలి ఉంది. చివరి వరకూ జగన్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ఆయన.. సాధ్యం కావటంతో కేంద్రంలో తిరుగులేని పవర్లో ఉన్న బీజేపీలో చేరిపోతే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ప్రజలు ఏమనుకుంటారన్న విషయాన్ని పక్కన పెట్టేసి.. బీజేపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇలాంటి నిర్ణయమే తీసుకునే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. బాబుకు వరుస షాకులు తప్పవనే చెప్పాలి.