చేర‌న్ కు విశాల్ డెడ్లీ వార్నింగ్!

Update: 2017-12-05 11:03 GMT
త‌మిళ‌నాడులో ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక కాక రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. `అమ్మ` ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అక్క‌డ గెలుపును అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. న‌డిగ‌ర్ సంఘం అధ్యక్షుడు - హీరో విశాల్ ఈ ఉప ఎన్నిక‌లో ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగ‌డంతో త‌మిళ‌ రాజ‌కీయాలు ర‌సకందాయంలో ప‌డ్డాయి. అయితే, త‌మిళ‌నాడు సినీ నిర్మాత‌ల మండ‌లి(టీఎఫ్ పీసీ) అధ్య‌క్షుడు అయిన విశాల్ త‌న ప‌దవికి రాజీనామా చేశాకే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత చేర‌న్ డిమాండ్ చేస్తున్నారు. విశాల్ రాజీనామా కోరుతూ టీఎఫ్ పీసీ ఆఫీసు ఎదుట చేర‌న్ ధ‌ర్నాకు దిగారు. ఆర్కే నగర్ ఎన్నిక‌ల బ‌రిలో నుంచి త‌ప్పుకోవాల‌ని విశాల్ ను చేర‌న్ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆ డిమాండ్‌ పై విశాల్ ఘాటుగా బ‌దులిచ్చారు. బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విశాల్ చేరన్ను హెచ్చరించారు.

విశాల్ పోటీ వ‌ల్ల త‌మిళ ఇండ‌స్ట్రీపై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని చేర‌న్ ఆరోపించారు. ఎవ‌రి మాటో విన విశాల్ పోటీ చేస్తున్నార‌ని, చివ‌రికి ఇబ్బందిప‌డ‌తార‌ని అన్నారు. నిర్మాతల సంక్షేమం కోసం విశాల్‌ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో గెలుపొందాక కరుణానిధిని విశాల్ క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నార‌ని, తాజాగా, ఎంజీఆర్‌ - జయలలిత సమాధులకు అంజలి ఘటించడం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని చేర‌న్ ప్ర‌శ్నించారు. దీంతో, చేరన్ వ్యాఖ్యలపై విశాల్ మండిప‌డ్డారు. చేర‌న్ అంటే త‌న‌కు గౌర‌వ‌ముంద‌ని - అయితే, ప‌బ్లిసిటీ కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ మానాల‌ని విశాల్ అన్నారు. అయినా, టీఎఫ్ పీసీ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉండి, ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌నే చ‌ట్టం ఏమీ లేద‌ని చెప్పారు. తాను పోటీ చేసినందువ‌ల్ల కోలీవుడ్ పై ప్ర‌భుత్వ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంద‌న్న చేర‌న్ వ్యాఖ్య‌ల‌ను విశాల్ ఖండించారు. చేర‌న్ ఇటువంటి చీప్ ట్రిక్స్ కు స్వ‌స్తి చెప్ప‌కుంటే అత‌డిపై న్యాయ‌ప‌ర‌మైన‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విశాల్ హెచ్చరించారు. ఈ ప్ర‌కారం చేరన్ కు సమాధానం ఇస్తూ విశాల్ త‌మిళంలో రాసిన ఓ  సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.
Tags:    

Similar News