క‌బ్జాల‌పై మ‌రో బాంబు రెఢీ అన్న బాబు ఫ్రెండ్‌

Update: 2017-06-17 04:39 GMT
ఇప్ప‌టికున్న స‌మ‌స్య‌లు స‌రిపోన‌ట్లుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స్నేహితుడు.. ఏపీ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన విశాఖ భూకబ్జా వ్య‌వ‌హారం ఏపీ ముఖ్య‌మంత్రికి చిరాకు తెప్పించేలా మారింది. విప‌క్ష‌మే కాదు.. అధికార‌ప‌క్షానికి మిత్రప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీతో స‌హా.. స్వ‌ప‌క్షానికి చెందిన ప‌లువురునేతలు క‌బ్జాల మీద చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఏపీ స‌ర్కారు డిఫెన్స్‌ లో ప‌డింది.

ఇప్ప‌టికే విశాఖ భూక‌బ్జా మీద ప‌లు విమ‌ర్శ‌లు చేసిన విష్ణుకుమార్ రాజు తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు కొత్త క‌ల‌క‌లానికి తెర తీసింది.తాను మ‌రో 15 రోజుల వ్య‌వ‌ధిలో విశాఖ‌లో చోటు చేసుకున్న‌  మ‌రో భారీ కుంభ‌కోణాన్ని బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. తాను బ‌య‌ట‌పెట్టే కుంభ‌కోణంలో ప్ర‌జాప్ర‌తినిధులే నేరుగా భూ దోపిడీకి పాల్ప‌డిన ఉదంతాలు ఉన్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం తాను సాక్ష్యాల సేక‌ర‌ణ‌లో ఉన్నాన‌ని.. ప‌దిహేను రోజుల్లో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మ‌రీ.. భారీ కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌న్నారు.  సాక్ష్యాల‌న్నీ మీడియా ముందు పెడ‌తాన‌ని.. విశాఖ భూక‌బ్జాల‌పై ఇప్ప‌టికే వెలుగులోకి వ‌చ్చిన అంశాల‌పై రాష్ట్ర స‌ర్కారు నియ‌మించిన సిట్ తో న్యాయం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు అనుకోవ‌ట్లేద‌న్నారు.

ఆర్నెల్ల క్రిత‌మే అసెంబ్లీ సాక్షిగా విశాఖ భూక‌బ్జా మీద‌ సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు తాను ఆదేశించాన‌ని విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. తాను చెప్పిన రోజే కానీ సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు ఆదేశిస్తే తాజా ప‌రిస్థితులు ఉండేవి కావ‌ని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ భ‌వనంలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఛాంబ‌ర్ లీకేజీపై వెనువెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించినంత స్పీడ్ గా విశాఖ భూక‌బ్జా మీద విచార‌ణను ఎందుకు వేయ‌లేదు? అని ప్ర‌శ్నించారు. మొత్తంగా చూస్తే.. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య‌ల‌కు ఏపీ అధికార‌ప‌క్షం డిఫెన్స్ లో పడిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News