సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన విమర్శల ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. సీఎం చంద్రబాబు విజయవాడలో చేస్తున్న దీక్ష సందర్భంగా బాలకృష్ణ తెలుగులో - హిందీలో ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వైసీపీని అడ్డం పెట్టుకొని మోడీ రాజకీయాలు చేస్తున్నారంటూ శిఖండి - కొజ్జా...మక్కీఛూజ్ అంటూ తిట్లతో రెచ్చిపోయారు. ఈ పరిణామంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అనే తేడాలేకుండా బాలయ్యపై బీజేపీ విరుచుకుపడుతోంది. బాలయ్య ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టేలా వ్యూహం రచిస్తోంది. తాజాగా బీజేపీ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు - ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ లు బాలయ్య కామెంట్లను ఖండించారు. ఒక ఉన్మాది మాదిరి ప్రధానిపై విమర్శలు చేయడంపై విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు.
గవర్నర్ నరసింహన్ విశాఖ పర్యటనలో ఉండటంతో బీజేపీ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు - ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆయనకు బాలయ్య వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. దేశ ప్రధానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహించడం గర్హనీయమని ఈ సందర్భంగా బీజేపీ ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. బాలయ్య విమర్శించిన తీరు అత్యంత హేయమని ఆయన్ను అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోడీని చెప్పడానికి వీలుకాని భాషలో దుర్భాషలాడటం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. ప్రధానిపై దాడి చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో బాలకృష్ణ మాట్లాడటంపై పోలీసులు తక్షణమ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి వంటి సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు. చట్టం నుంచి తప్పించుకునే తెలివితేటలు బాలకృష్ణ సొంతమైతే, తాము చట్టం, న్యాయ పరంగా చర్యలకు ఉద్యమిస్తామన్నారు.
చంద్రబాబు చేస్తున్నది ‘అధర్మపోరాట దీక్ష’గా విష్ణుకుమార్ రాజు అభివర్ణించారు. పూర్తి అధికార దుర్వినియోగంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించుకోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ, మభ్యపెట్టే రీతిలో సాగిన దీక్షను దొంగ దీక్షగా ఆరోపించారు. కాగా, గతంలో గవర్నర్ తీరును తప్పుపట్టిన విష్ణకుమార్ రాజు అదే గవర్నర్‌కు తాజాగా ఫిర్యాదు చేయడం ఆసక్తికరం. నాలా బిల్లు ఆమోదం విషయంలో ఆంధ్రాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, తెలంగాణా పక్షపాతని తీవ్ర విమర్శలు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన గవర్నర్‌కే న్యాయం కోరుతూ ఫిర్యాదు చేయడం, పైగా బాలయ్య ఎమ్మెల్యే గిరిని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉండగా... తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా బీజేపీ నేతలు బాయల్యపై ఫిర్యాదులు చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు. విశాఖ నగరంలోని ఆశీల్‌మెట్ట కూడలి వద్ద సినీనటుడు బాలకృష్ణ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ, బీజేపీ హైదరాబాద్ అధ్యక్షుడు రాంచందర్ రావుపై బాలయ్యపై ఉస్మానియా యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధానిని కించపర్చేలా వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.