ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి. గ్రాఫ్ పెరిగిందా లేక అలాగే ఉందా. అదీ కాకపోతే బాగా తగ్గిందా. అసలు ఏపీ మీద బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఏపీలో బీజేపీని బాగుచేసుకోవడం కోసం పార్టీకి వ్యూహాలు ఉన్నాయా. ఉంటే ఎపుడు అమలు చేస్తారు. దానికి ముహూర్తం ఎపుడు పెడతారు. లేక పొత్తులతో కొన్ని సీట్లు తీసుకుని గతం మాదిరిగానే ఉనికి పోరాటం చేస్తారా ఇవన్నీ కూడా ప్రశ్నలే.
దీనికి జవాబు అయితే కొంతవరకూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ విష్ణు కుమార్ రాజు చెప్పే ప్రయత్నం చేశారు అనుకోవాలి. ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో పాల్గొన్నారు. దాని ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ఆదివారం రాత్రి టోటల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. అయితే కట్ చేసి రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే సొంత పార్టీ పోకడల మీదనే మాజీ ఎమ్మెల్యే ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు ఘాటైన కామెంట్స్ చేశారు అనిపిస్తోంది.
ఏపీలో బీజేపీకి ఒక్క సీటూ రాదని తాను ఏకంగా ప్రధాని మోడీకే చెప్పాను అని ఆయన ఈ ప్రోమోలో చెప్పడం జరిగింది. దాని మీద ప్రధాని ఏమన్నారు అన్నది టోటల్ ఎపిసోడ్ లో ఆయన చెప్పబోతారు అని తెలుస్తోంది. గత ఏడాది ప్రధాని విశాఖ వచ్చినపుడు ఏపీ బీజేపీ పదాధికారులతో సమావేశం అయ్యారు. బహుశా అపుడు విష్ణు కుమార్ రాజు ఏపీ పరిస్థితి మీద చెప్పినట్లుగా ఉంది అని అంటున్నారు.
అయితే అది నాడు బయటకు రాలేదు కానీ ఇపుడు ఆయనంతట ఆయనే చెప్పి ఏపీలో బీజేపీకి చేయడానికి ఏమీ లేదని నిస్సహాయతను వ్యక్తం చేశారు. తెలంగాణాలో వంద కోట్ల లిక్కర్ స్కాం మీద ఈడీలు సీబీఐలు రైడింగ్ చేస్తూంటే ఏపీలో నెలకు రెండు వేల కోట్లకు పైగా లిక్కర్ స్కాం జరుగుతూంటే ఎందుకు దాడులు ఉండవని కూడా విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు.
ఏపీని వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణా అభివృద్ధి చెందింది. ఏపీ మాత్రం ప్రస్తుతం ఇబ్బందులో ఉందని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ వైసీపీ కలసిపోయాయన్న ప్రచారం తమను దెబ్బ తీస్తోనని మరో హాట్ కామెంట్ ఆయన చేశారు.
రీసెంట్ గా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ విషయం బాగా జనాల్లో చర్చకు ఉండడం వల్లనే తాము ఘోరంగా ఓడిపోయామని ఆయన అనడమూ ఈ ప్రోమోలో కనిపించింది. విశాఖ రాజధాని ఎవరికి కావాలని విష్ణు కుమార్ రాజు సెటైర్లు వేశారు. ఏపీలో బీజేపీ రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆయన అంటున్నారు
ఇక తెలుగుదేశం పార్టీలోకి ఎపుడు వెళ్ళబోతున్నారు అన్న ప్రశ్నకు మాత్రం ఆయన పూర్తి సమాధానం ఏంటో టోటల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. పెళ్లి కాక ముందే బిడ్డ పేరు ఏంటి అని అడుగుతున్నారు అన్న మాటతో ఈ ప్రోమోని కట్ చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మీద గతంలో చాలా సార్లు విష్ణు కుమార్ రాజు ప్రశంసలు కురిపించారు.
ఆయన 2024 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన మరో మాట కూడా అన్నారు. జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తులు ఉంటే మాత్రం వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదని. ఒకవేళ బీజేపీ ఈ పొత్తులకు దూరంగా ఉంటే మాత్రం ఆయన టీడీపీలోకి జంప్ చేస్తారని ప్రచారం అయితే గట్టిగా ఉంది. ఇపుడు ఆయన దాని మీద ఏమి చెప్పబోతున్నారు అన్నది పూర్తి ఎపిసోడ్ లోనే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న విష్ణు కుమార్ రాజు ఓపెన్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో బీజేపీ మీద విమర్శలు చేసినట్లుగా కనిపిస్తోంది. అవేంటో చూడాల్సి ఉంది మరి.
Full View