రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శత్రువులు ఎప్పుడూ ఎవరికి ఉండరని చెబుతారు. దీనికి తగ్గట్లే చాలానే పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పటివరకూ తిట్టిపోసిన పార్టీలోకి తిట్టిన నేత దర్జాగా వెళ్లి చేరటమే కాదు.. పదవులు చేపట్టిన ఉదంతాలు ఇప్పటికే చాలానే చూశాం.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీరు కాస్త భిన్నం. ముక్కుసూటిగా మాట్లాడారన్న పేరున్న ఆయన.. అసెంబ్లీలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసేందుకు వెనుకాడలేదు. అదే సమయంలో బాబు పాలనా తీరును పొగిడిన తీరును మర్చిపోలేం.
తాజాగా ఢిల్లీలో ఉన్న చంద్రబాబును ఏపీ భవన్ లో కలిశారు విష్ణుకుమార్ రాజు. ఓపక్క జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. బాబుతో ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. మళ్లీ మీరే సీఎం అవ్వాలి సార్ అంటూ బాబును ఉద్దేశించి రాజు చేసిన వ్యాఖ్య అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య విష్ణుకుమార్ రాజుకు ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉందంటున్నారు. బాబు పొడ గిట్టని మోడీకి.. బాబు గెలుపు మీద ఆకాంక్షను వ్యక్తం చేసిన తీరు కచ్ఛితంగా ఆయన కెరీర్ కు దెబ్బ పడే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఏ వ్యూహంలో బాబును రాజు కలిశారన్న దానిపై స్పష్టత రావట్లేదు. ఓపక్క మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బాబు ఓటమి పక్కా అంటున్న వేళ.. విష్ణుకుమార్ రాజు ఆకాంక్ష తెలుగు తమ్ముళ్లకు సర్ ప్రైజ్ గా మారిందని చెప్పక తప్పదు.