విష్ణుకుమార్ రాజు ఆంధ్రోడేనా?

Update: 2017-12-01 04:21 GMT
మ‌రే రాష్ట్ర నేత‌ల‌కు లేని ఓ చిత్ర‌మైన జ‌బ్బు తెలుగు నేత‌ల‌కు ఉంద‌నే మాట ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఇక‌పై.. దాన్ని కాస్త స‌వ‌రించాలి. తెలుగు నేత‌ల‌కు కాదు.. ఆంధ్రా నేత‌ల‌కు ఉందంటే స‌రిపోతుంది. ఎందుకంటే.. సొంతిల్లు త‌గ‌లెడిపోతున్నా త‌మ‌కున్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఏ మాత్రం వెన‌కాడ‌ని ఆంధ్రా నేత‌ల తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఈ త‌ర‌హా విధేయ‌త‌న ప్ర‌ద‌ర్శించిన ఏపీ కాంగ్రెస్ నేత‌ల పుణ్య‌మా అని రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌ట‌మే కాదు.. దారుణ‌మైన న‌ష్టం వాటిల్లింది.

విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగే న‌ష్టం ఎంత‌న్న‌ది ఇప్ప‌టికి ఆంధ్రోళ్ల‌కు తెలిసి రాలేద‌న్న కొంద‌రి మాట నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. ఎందుకంటే.. త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై ఆగ్ర‌హంతో నేత‌ల్ని నిల‌దీసి.. ఎప్ప‌టిక‌ప్పుడు క‌డిగిపారేసి ఉంటే నేత‌ల్లో ఒకింత భ‌యం ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటిదేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి.

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం నుంచి ఇటీవ‌ల కాలంలో వ‌స్తున్న ఆదేశాల సారాంశం ఒక్క‌టే. ప‌రుగులు తీయిస్తున్న పోల‌వ‌రం ప‌నులు తాత్కాలికంగా ఆగిపోవ‌ట‌మే. ఈ విష‌యం కాస్త సీరియ‌స్ గా ప‌రికిస్తే అర్థ‌మ‌వుతుంది. కానీ.. అలాంటిదేమీ లేదంటూ ఏపీ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు చేస్తున్న వ్యాఖ్య‌లు షాకింగ్ గా మారాయి. వీలైనంత‌వ‌ర‌కూ మోడీతో ఎలాంటి వైరం పెట్టుకోకుండా బండి న‌డిపించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి.

మోడీకి ఇప్పుడున్న ఇమేజ్ నేప‌థ్యంలో ఆయ‌న్ను ఎదుర్కొంటే జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఓటుకు నోటు లాంటి ముచ్చ‌ట్లు లేక‌పోలేదు. అందుకే.. ప్ర‌తి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు లాంటోడు సైతం గురువారం అసెంబ్లీ బ‌ర‌స్ట్ అయిపోయారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ భ‌విష్య‌త్తుకు ఢోకా లేద‌ని.. చిన్న చిన్న స‌మ‌స్య‌లున్నా అధిగ‌మిస్తామ‌ని ధీమాగా చెప్పేవారు. అందుకు భిన్నంగా తాజా మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. అవ‌స‌ర‌మైతే పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రానికి ఇచ్చేయ‌టానికి సైతం తాను సిద్ధ‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు.

త‌న‌కు భేష‌జాలు లేవ‌ని.. ప‌ని పూర్తి కావ‌ట‌మే ముఖ్య‌మ‌ని.. క్రెడిట్ లెక్క‌ల‌తో త‌న‌కు సంబంధం లేద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశారు. బాబు నోటి నుంచి పోల‌వ‌రం మీద వ‌చ్చిన వ్యాఖ్య‌లు వింటే.. తాజాగా ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇలాంటివేళ‌.. విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ల మాట‌లు వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఓవైపు పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంపై నీలిన‌డ‌లు క‌మ్ముకుంటున్న వేళ‌.. అలాంటిదేమీ లేద‌ని.. చంద్ర‌బాబు కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మోడీ స‌ర్కారు మోకాలు అడ్డు పెడుతున్న వైనాన్ని చిన్నా చిత‌క సాంకేతిక స‌మ‌స్య‌లుగా ఆయ‌న అభివ‌ర్ణించ‌టం చూస్తే.. ఎక్క‌డో ఏదో తేడా కొట్ట‌టం ఖాయం. ఓప‌క్క బాబు లాంటి నేత నోటి నుంచి రాకూడ‌ని మాట‌లు వ‌స్తున్న వేళ‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం మాట్లాడాల్సిన విష్ణుకుమార్ రాజు లాంటోళ్లు.. త‌మ అధినాయ‌కుడి భ‌జ‌న‌లో త‌రిస్తున్న తీరు చూస్తే.. ఆంధ్రా నేత‌లు ఎప్ప‌టికి బాగుప‌డ‌రా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు.

ఇదే త‌ర‌హా భ‌జ‌న కార్య‌క్ర‌మంలో ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించిన ఆంధ్రా కాంగ్రెస్ నేత‌ల పుణ్య‌మా అని సీమాంధ్ర భారీగా న‌ష్ట‌పోయింది. ఇప్పుడు అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శిస్తున్నారు విష్ణుకుమార్ రాజు. ఆయ‌న తీరు చూస్తుంటే.. సొంతిల్లు త‌గ‌ల‌డిపోతున్నా ప‌ట్టించుకోకుండా త‌మ బాస్ పేరు ప్ర‌ఖ్యాతుల‌కు ఎలాంటి చెడ్డ‌పేరు రాకూడ‌ద‌న్న‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీ మీద ఈగ వాలేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని వైనం చూస్తే.. విష్ణుకుమార్ రాజు ఆంధ్రోడేనా? అన్న అనుమానం రాక మాన‌దు. ఈ త‌ర‌హా విధేయ‌త ఎక్కువ కాలం న‌డ‌వ‌ద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

పార్టీ ముఖ్య‌మే అయినా.. త‌మ‌ను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల ముందు పార్టీ ప్ర‌యోజ‌నాలు పెద్ద‌వి కావాన్న విష‌యం రాజు గారు లాంటోళ్లు మ‌ర్చిపోకూడ‌దు. గుడ్డిగా స‌మ‌ర్థించే క‌న్నా.. న్యాయం ప‌క్షాన‌.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిస్తే అదే వారి శ్రీ‌రామ ర‌క్ష‌గా నిలవ‌టం ఖాయం. కానీ.. అలాంటివి ఏమీ ప‌ట్ట‌ని రాజులాంటోళ్లు పార్టీ ప‌ట్ల త‌మ‌కున్న విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. పార్టీ మీద విధేయ‌త ఉండాలే కానీ.. పార్టీ కోసం త‌న‌ను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని తాక‌ట్టు పెట్ట‌కూడ‌ద‌న్న చిన్న పాయింట్‌ ను మ‌ర్చిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. సొంతోళ్ల ప్ర‌యోజ‌నాల్ని తాక‌ట్టు పెట్టే నేత‌లు ప్ర‌జ‌ల ప్రేమాభిమానాల్నేకాదు.. సొంత పార్టీ నేత‌ల ఆద‌ర‌ణ‌ను కోల్పోతార‌న్న విష‌యాన్ని రాజు లాంటి నేత‌లు ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది.
Tags:    

Similar News