ఏపీ అసెంబ్లీలో రెండో రోజున సభాపతిని ఎన్నుకున్నారు. భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇదంతా చాలా మామూలుగానే జరిగిపోయింది. దీంతో తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా స్పీకరుగా ఎన్నికయ్యారు. అయితే... ఆయన్ను మర్యాదపూర్వకంగా స్పీకరు స్థానం వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టే సంప్రదాయం పాటించే సమయంలో మాత్రం పాలక - విపక్షాల మధ్య మాటకుమాట తప్పలేదు. ముఖ్యంగా స్పీకరును ఆయన స్థానం వరకు తీసుకెళ్లేటప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్లకపోవడాన్ని పాలకపక్షం తప్పుపట్టింది. ఆయనెందుకు వెళ్లలేదనే విషయంలో టీడీపీ కూడా తన వాదన వినిపించింది. అయితే.. అసెంబ్లీలోని పాలక విపక్షాల మధ్య మాటామాటా ఎలా ఉన్నా.. అసెంబ్లీలో సభ్యుడు కాని బీజేపీ నేత ఒకరు ఈ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ శాసనసభలో ఈరోజు చంద్రబాబు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారామ్ కూర్చోబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. అక్కడితో ఆగని ఆయన 2009లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నుకున్నప్పుడు సభాసంప్రదాయాల ప్రకారం ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు రాలేదని గుర్తుచేశారు. కానీ నాదెండ్ల మనోహర్ స్పీకర్ అయినప్పుడు మాత్రం చంద్రబాబు వచ్చారన్నారు. ఇందుకు కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
విష్ణు వర్ధన్ రెడ్డి ట్వీట్ లో లేవనెత్తిన ప్రశ్నలతో ఏపీ రాజకీయాల్లో రెండు రకాల చర్చ జరుగుతోంది. నాదెండ్ల మనోహర్ సామాజికవర్గం రీత్యా చంద్రబాబు ఆయన్ను తోడ్కొని వెళ్లారన్న అర్థంలో విష్ణు ఈ ట్వీట్ చేశారని కొందరు అంటుంగా... ఇంకొందరు ఇంకా ముందుకెళ్లి... తన కంటే ముందు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి తనకు స్ఫూర్తినిచ్చిన నాదెండ్ల భాస్కరరావు తనయుడు కావడం వల్లే మనోహర్ స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు అంత సంతోషంగా ఆయన్ను తోడ్కొని వెళ్లారని భాష్యం చెబుతున్నారు.