కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఆ పార్టీకి మైలేజీ ఇవ్వాల్సింది పోయి మైనస్ గా మారిందా అనే సందేహాలను ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పర్యటన పెట్టుకొని హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరామర్శ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. అయితే రాహుల్ కామెంట్ల పై బీజేపీ ఘాటుగా స్పందించింది.
బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తోందని...రాహుల్ గాంధీకి ఆత్మహత్యలు - మరణాల సమయంలోనే తెలుగు రాష్ర్టాలు గుర్తుకువస్తాయా అంటూ ప్రశ్నించారు. రోహిత్ ఆత్మహత్య కేంద్రంగా ఇపుడు కాంగ్రెస్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోహిత్ మరణంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర ఘటన అపుడు రాహుల్ ఏమైపోయారని ప్రశ్నించారు. ఇద్దరు పసిపిల్లలతో సహా రాజయ్య కోడలు అనుమానాస్పద మరణంపై లోకమంతా విస్తుపోయినా కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని అన్నారు.