ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న అసెంబ్లీ సాక్షిగా తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా - విభజన హామీల అమలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకు టీడీపీ అధినేత నిర్ణయించారు. దీంతో, కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు - సుజనా చౌదరి తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు సాయంత్రం 4 గంటలకు రాజీనామా లేఖలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ - దేవాదయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు....చంద్రబాబునాయుడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా గాలి వీస్తోందని - అందుకే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే బీజేపీతో తెగదెంపుల నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం రాజకీయ మైలేజీ కోసమే కేంద్ర మంత్రులతో టీడీపీ రాజీనామా చేయించిందని విష్ణు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధులను వేరే రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పినా టీడీపీ వినలేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల పై చంద్రబాబు చెప్పిన లెక్కలు సరికావని - చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తన దగ్గర కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం బండారం బయటపెడతానని చెప్పారు. కేంద్రానికి ఏపీ సమర్పించిన డీపీఆర్ - ఎల్పీలను త్వరలోనే బయటపెడతానని అన్నారు. సకాలంలో వాటిని కేంద్రానికి సమర్పించకపోవడం వల్లే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అన్నారు. హోదా ప్రజల సెంటిమెంట్ అంటూ కేబినెట్ నుంచి వైదొలగడం సరికాదని, ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తామని, అయితే, దానిని రాజకీయం చేయబోమని అన్నారు. వెంకయ్య నాయుడు రాష్ట్రం కోసమే ఆలోచిస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఇస్తామన్న వాటిని మూడున్నర సంవత్సరాల్లో 85శాతం వరకు ఇచ్చామన్నారు.