ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. కేంద్రంలో అధికారంలో బీజేపీ, రాష్ట్రంలో ఎంత హడావిడి చేసినా పుంజుకోలేకపోతోంది. అసలు టీడీపీ స్థానాన్ని భర్తీ చేసేసి తామే అని మాటలు చెప్పే బీజేపీ నాయకులకు కనీసం వార్డు మెంబర్‌గా గెలిచే సత్తా లేదని అర్ధమైపోయింది. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే బీజేపీకి ఛాన్స్ లేదు. తిరుపతి ఉప ఎన్నికలో సైతం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అయితే భవిష్యత్‌లో కూడా బీజేపీకి పెద్ద సీన్ లేదనే చెప్పొచ్చు. కాకపోతే కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకులు కాస్త ధీమాగా ఉంటున్నారు. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పలువురు బీజేపీ నాయకులు ప్లేట్ తిప్పేయోచ్చని తెలుస్తోంది. అలా ప్లేట్ తిప్పేసివారిలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో బీజేపీ నాయకులు ఎక్కువగా అధికార వైసీపీ కంటే, ప్రతిపక్ష టీడీపీ మీద విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొందరు నాయకులు మాత్రం వైసీపీ టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. అలా వైసీపీపై విరుచుకుపడేవాళ్లలో విష్ణుకుమార్ రాజు ముందువరుసలో ఉన్నారు. ఈయన మీడియా సమావేశం పెట్టి మరీ వైసీపీపై ఫైర్ అవుతున్నారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు విష్ణు వర్థన్ రెడ్డి లాంటి నేతలు ఎక్కువుగా టీడీపీనే టార్గెట్ చేస్తుంటారు. కానీ విష్ణు మాత్రం ఇందుకు భిన్నంగా వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తుంటారు.
ఇటీవల రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఇలా వైసీపీ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న రాజుగారు టీడీపీ మీద మనసు పడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో రాజుగారు టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసి విశాఖ నార్త్ నుంచి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడంతో రాజుగారు డిపాజిట్లు దక్కలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్నా... ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా విష్ణు మాత్రం అసెంబ్లీలో చంద్రబాబుకు భజన చేసేవారు.
అయితే బీజేపీలోనే ఉంటే రాజుగారికి భవిష్యత్ కనిపించడం లేదు. టీడీపీలోకి వెళితే ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ అయిన వస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ఒకవేళ టీడీపీలో కొనసాగినా, నెక్స్ట్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అందుకే గంటా ప్లేస్‌ని రీప్లేస్ చేయాలని రాజుగారు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి రాజుగారు టీడీపీ వైపు ఎప్పుడు వస్తారో ?