'అరవింద సమేత' ను నిషేధించాలి: బీజేపీ నేత

Update: 2018-10-22 11:07 GMT
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నేపథ్యాన్ని మొత్తం రాయలసీమ ఫ్యాక్షన్ నుంచి తీసుకున్నారు. అయితే అందులోని కొన్ని సీన్లు, పదాలపై ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

తాజాగా అరవింద సమేత చిత్రాన్ని నిషేధించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా కొన్ని సీన్లను చిత్రీకరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల మనోభావాలు గుర్తించి సినిమాను ఆడకుండా చేయాలని కోరారు.

ఇక రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని.. టీడీపీ తెలుగు ద్రోహల పార్టీ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమలోనే హైకోర్టుకు కేంద్రం ప్రయత్నించిందని.. కానీ టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ నేతలకు మేలు జరిగేలా ఉన్న పరిశ్రమ ఏర్పాటు కోసం చైనాతో రహస్య సమావేశాలు నడిపారని ఆయన మండిపడ్డారు. కియా ఫ్యాక్టరీ కూడా మోడీ మేకిన్ ఇండియాలో భాగంగానే వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
Tags:    

Similar News