దేశ ప్రధానిగా తిరుగులేని నాయకుడిగా మారిన నరేంద్ర మోడీని అత్యధికులు అభిమానిస్తుంటారు. అంతకు మించిన ప్రేమిస్తారన్నది వాస్తవం. ఈ దేశానికి రక్షకుడిగా ఆయన్ను అభివర్ణించే సామాన్యులు కోట్లాదిగా ఉంటారు. రాజకీయంగా ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీని విబేధించే వారు సైతం.. దేశానికి ప్రధానిగా మాత్రం మోడీనే ఉండాలని కోరుకోవటం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. బీజేపీని వ్యతిరేకించే వారు సైతం.. ప్రధాని కుర్చీలో మాత్రం మోడీనే ఉండాలన్న మాట అదే పనిగా చెబుతుంటారు.
అయితే.. ఆయన్ను విమర్శించేవారు.. విధానాల్ని తప్పు పట్టే వారు లేకపోలేదు. కాకుంటే.. వారి గళం చాలా చిన్నదిగా చెప్పాలి. ఇదంతా ఎందుకంటే.. దేశ ప్రజల ఆదరాభిమానాల్ని సొంతం చేసుకున్న మోడీ.. వ్యక్తిగతానికి సంబంధించిన ఒక అంశం పెద్ద ఫజిల్ లా మారింది. చక్కగా ట్రిమ్ చేసినట్లుగా ఉండే మోడీ గడ్డం.. ఇటీవల కాలంలో భారీగా పెరగటం.. రుషుల మాదిరి అంతలా గడ్డం పెంచటానికి కారణం ఏమిటి? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.
కొందరు రాజకీయ నేతలు మాత్రం.. అదంతా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసమన్న మాటను చెబుతుంటారు.బెంగాలీలు అమితంగా ఇష్టపడే రవీంద్రనాథ్ రాగూర్ ను గుర్తుకు తెచ్చేలా గడ్డాన్ని పెంచుతున్నట్లుగా పేర్కొంటారు. అయితే.. ఈ వాదనలో పెద్ద పస ఉన్నట్లుగా అనిపించదు. గడ్డం పెంచుకుంటే ఠాగూర్ లా కనిపిస్తారా? అన్న ప్రశ్న వినిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ గడ్డం గుట్టును ఒక స్వాములోరు ప్రస్తావించారు. ఆయన చెప్పిన కారణం చూస్తే.. ఆయన మాటల్లో వాస్తవానికి దగ్గరగా ఉందన్న భావన కలుగక మానదు.
ఇంతకీ ఆ స్వాములోరు ఎవరు? ఆయనేం చెప్పారన్న విషయంలోకి వెళితే.. మోడీ గడ్డం గుట్టును విప్పే ప్రయత్నం చేసిన స్వాములోరు ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనకున్న మరో అదనపు బాధ్యత ఏమంటే.. అయోధ్య రామమందిర ట్రస్టు సభ్యుడు. మోడీ గడ్డం వెనుకున్న కారణం.. అయోధ్యలోని రామాలయ నిర్మాణమేనని చెబుతున్నారు. అదెలా అన్న మాటకు ఆయన తనదైన శైలిలో కారణాన్ని వివరిస్తున్నారు.
అయోధ్యలోని రామాలయం కోసం ప్రధాని మోడీ భూమిపూజ చేశారని.. ఇలాంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలు తొలగించరని చెబుతున్నారు. మోడీ గడ్డం.. జుట్టు కత్తిరించకపోవటానికి ఇదే కారణమై ఉండొచ్చని చెప్పారు. ఈ స్వాములోరి మాటల్లో నిజం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. మన ఇళ్లల్ల్లోనూ ఏదైనా పని పెట్టుకుంటే.. అది పూర్తి అయ్యే వరకు గడ్డం.. మీసాలు కత్తిరించుకోకుండా అలా పెంచేసుకోవటం అలవాటే. అందాకా ఎందుకు? భార్య గర్భవతిగా ఉన్న నాటి నుంచి.. డెలివరీ అయ్యే వరకు కేశాలు కత్తిరించుకోని భర్తలు ఎందరో ఉంటారు. ఆ లెక్కన చూస్తే.. ఉడుపి స్వాములోరు చెప్పిన మాట అతికినట్లుగా ఉందని చెప్పక తప్పదు.