కోటి ఒళ్లు మంట పెట్టుకునేలా చేసింది

Update: 2015-08-08 16:40 GMT

Full View
విభజన కారణంగా దారుణంగా నష్టపోయిన ఏపీకి ఆసరా ఇచ్చే ఫ్రత్యేక హోదా కోసం ఒక యువకుడు తన ప్రాణాలు ఇచ్చేందుకు సైతం సిద్ధపడ్డాడు. తిరుపతిలో ఏపీ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరు సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తిరుపతిలోని మంచాల వీధికి చెందిన బీఎంకే కోటి అనే యువకుడు.. సభలో తనతో తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటి మీద పోసుకొని నిప్పు అంటించకున్నాడు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన పోరు సభలో కలకలం రేపింది.

కోటి చుట్టు ఉన్న వారిలో కొందరు ప్రయత్నించి అతడ్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో మరో యువకుడి చేయి కాలింది. దీంతో.. ఏపీ ఒక్కసారి ఉలిక్కిపడింది.

ఇక.. ఒంటిని అంటించుకొని ఆత్మాహుతికి ప్రయత్నించిన కోటికి మెరుగైన చికిత్స కోసం రుయా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. 70 శాతం కాలిన గాయాలతో కోటి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏపీ రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తున్నాయే తప్పించి.. చిత్తశుద్ధితో పోరాడని దుర్మార్గానికి ‘‘కోటి’’ ఉదంతం ఒక నిదర్శనమని ఏపీ ప్రజలు మండి పడుతున్నారు.
Tags:    

Similar News