తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్. యువకుడైన ఈ నేత సాఫ్ట్ అన్న పేరుంది. తొందరపాటుగా మాట్లాడటం.. అనవసరమైన వ్యాఖ్యలు చేయటం.. ఊరికే విరుచుకుపడటం లాంటివి వివేక్ అస్సలు చేయరన్న పేరుంది. కూల్ గా ఉంటూ.. ఆచితూచి మాట్లాడినట్లుగా కనిపించే ఆయన తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద విరుచుకుపడ్డారు.
తెలంగాణలో వరుసగా చోటుచేసుకుంటున్న కల్తీకల్లు మరణాల మీద వివేక్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. కల్తీ కల్లు మరణాల వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. చీప్ లిక్కర్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గిన తర్వాతే కల్తీ కల్లు మరణాలు జరుగుతున్నాయంటూ సరికొత్త సందేహాలకు తెర తీశారు.
గౌడ కులస్తులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించిన ఆయన.. చీమూ నెత్తురు ఉంటే మంత్రి తలసాని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీలో కానీ తలసాని మాట్లాడితే ఆయన్ను బహిష్కరించాలని కోరతామంటూ తామేం చేయాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ముందుగానే చెప్పేశారు. చేసే పనిని చెప్పేకన్నా.. చేతల్లో చూపిస్తే బాగుంటుందేమో. ఇంతకాలం సాఫ్ట్ వివేక్ గా ముద్రపడిన వివేక్ మాటల్ని వింటున్న వారు.. బాగానే రాటుదేలారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.