నరేంద్రమోడీ బయోపిక్ లో ఆయన పాత్రను పోషించిన నటుడు వివేక్ ఒబెరాయ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తను ఆయన పాత్రలో నటించడం వల్ల వివేక్ ఒబెరాయ్ నరేంద్రమోడీకి ఫ్యాన్ అయ్యాడో లేక ముందు నుంచి అభిమానో కానీ.. ఇప్పుడు మోడీని ఒక రేంజ్ లో మోస్తున్నారు వివేక్ ఒబెరాయ్. ఇక ఇదే సమయంలో ఆయన రాహుల్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం విశేషం.
రాహుల్ గాంధీ బయోపిక్ అనే అంశం మీద వివేక్ ఒబెరాయ్ తీవ్రంగా స్పందించారు. మోడీ బయోపిక్ రెడీ అయ్యింది కాబట్టి..రాహుల్ గాంధీ బయోపిక్ అనే ప్రశ్నకు ఈ హీరో తీవ్రమైన రియాక్షన్ ఇచ్చారు. ‘అసలు రాహుల్ గాంధీ బయోపిక్ ఎందుకు తీయాలి? ఆయన ఏం సాధించారని బయోపిక్ తీయాలి?’ అని వివేక్ ఒబెరాయ్ ప్రశ్నించేశారు. అంతటితో ఆగి ఉంటే అదో లెక్క. అయితే వివేక్ ఒబెరాయ్ అంత కన్నా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
‘ఒకవేళ రాహుల్ గాంధీ బయోపిక్ ను తీస్తే దాన్ని థాయ్ లాండ్ లోనే ఎక్కువగా చిత్రీకరించాల్సి ఉంటుంది..’అంటూ వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యానించారు. థాయ్ లాండ్ కు రాహుల్ గాంధీ రెగ్యులర్ కస్టమర్ అన్నట్టుగా నర్మగర్భపు వ్యాఖ్యలు చేశారు వివేక్.
రాహుల్ గాంధీపై ఈ బాలీవుడ్ నటుడు ఈ రేంజ్లో విరుచుకుపడే సరికి కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. వివేక్ ఒబెరాయ్ పై కాంగ్రెస్ గట్టిగా స్పందించింది. వివేక్ ఒబెరాయ్ ఒక ఫ్లాఫ్ హీరో అని, అతడు చేసింది ఏమీ గొప్ప సినిమా కాదు అని అదో బోగస్ సినిమా అని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేసింది!