2024లో పోటీ అంటున్న నటుడు!

Update: 2019-04-07 08:03 GMT
ఈ సారి ఎన్నికల సందర్భంగానే పొలిటికల్ గా వ్యాఖ్యానం చేసి ఆశ్చర్య పరిచాడు వివేక్ ఒబెరాయ్. నరేంద్రమోడీ  బయోపిక్ లో నటించడం ద్వారా వివేక్ ఒబెరాయ్ పాలిటిక్స్ లోకి పరోక్షంగా అడుగు పెట్టారు. కేవలం ఆ సినిమాలో నటించి ఆగలేదు వివేక్ ఒబెరాయ్. కొన్ని రాజకీయ ప్రకటనలు కూడా చేశాడు.

మోడీ మహానుభావుడంటూ వ్యాఖ్యానించడమే కాకుండా..రాహుల్ గాంధీపై కూడా తీవ్ర వ్యాఖ్యానాలు చేశాడు. రాహుల్ గాంధీ బయోపిక్ ప్రస్తావన రాగా.. వివేక్ రెచ్చిపోయాడు. బయోపిక్ తీసేంత సీన్ రాహుల్ కు ఏమీ లేదని వ్యాఖ్యానించిన ఈ నటుడు.. రాహుల్ గాంధీ బయోపిక్ ను తీస్తే అందులో ఎక్కువ భాగం థాయిలాండ్ లో తీయాల్సి వస్తుందని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు.

బీజేపీ నేతలను మించిపోయిన రీతిలో వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత వివేక్ కు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆయన ఒక ఫెయిల్యూర్ హీరో అంటూ కాంగ్రెస్ వాళ్లు ఎద్దేవా చేశారు. అదలా ఉండగా.. తన ప్రత్యక్ష రాజకీయ ఎంట్రీ గురించి స్పందించాడు వివేక్.

తను రాజకీయాల్లోకి రావడం ఇప్పట్లో జరగదని.. అయితే వచ్చే సారి ఏమైనా పోటీ చేయవచ్చేమో అని వివేక్ ఒబెరాయ్ అన్నాడు. 2024 లో తను తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కూడా చేయవచ్చునేమో అన్నాడు.  ఒకవేళ అదే జరిగే వడోదర నుంచి పోటీ చేయడం జరుగుతుందని ఒకనాటి హీరో, ప్రస్తుత విలన్- క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News