మీడియాను ఇంటికి పిలిచిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఏం చెప్పారంటే?

Update: 2022-02-23 03:47 GMT
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం.. అనూహ్య పరిణామాలు తిరగటమే కాదు.. దిమ్మ తిరిగిపోయే షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జరిగింది హత్యేనని.. అందుకు కారణం ఎవరన్న వివరాలు సీబీఐకి పలువురు ఇచ్చిన వాంగ్మూలంతో బయటకు రావటం తెలిసిందే. వివేకా కేసుకు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారటం.. ఆయన సంచలన నిజాల్ని వెల్లడించటం తెలిసిందే.

ఇదంతా డబ్బు కోసమేనని పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. కోర్టులో రెండు సార్లు అప్రూవర్ స్టేట్ మెంట్ ఇచ్చానని.. అదంతా డబ్బుల కోసం కాదని.. తన భార్యాపిల్లల కోసమేనని వెల్లడించారు. తాజాగా స్థానిక మీడియాను తన ఇంటికి పిలిపించిన ఆయన మాట్లాడారు. తొలుత వాంగ్మూలం ఇచ్చిన సమయంలో తనను బెదిరించారని.. ప్రలోభాలకు గురి చేశారని.. ఆ విషయాల్ని సీబీఐ ఎస్పీకి లేఖ ద్వారా వివరించినట్లు పేర్కొన్నారు.

రెండుసార్లు కోర్టులో అప్రూవర్ గా మారింది డబ్బు కోసం కాదు.. భార్య పిల్లలు అనాధలు అవుతారన్న ఉద్దేశంతోనే అప్రూవర్ గా మారినట్లు స్పష్టం చేశారు. ‘‘నేను ఎవ్వరి వద్దా డబ్బులు తీసుకోలేదు. డబ్బు తీసుకొని అఫ్రూవర్ గా మారినట్లు రాయొద్దు’’ అని చెప్పారు.

కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో తనకు భద్రత అవసరం చాలా ఉందన్నారు. తనకు స్థానిక ఎస్పీ ఆదేశాల మేరకు ఒక కానిస్టేబుల్ తో రక్షణ కల్పిస్తున్నారని.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదన్నారు. తాను ఇంటి నుంచి బయటకు ఎక్కడకు వెళ్లినా.. ఆ సమాచారం ముందే ఇవ్వాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. 
Tags:    

Similar News