విశాఖలో ఘనంగా ప్రారంభమైన విలాసవంతమైన ఓడ 'క్రూయిజ్ షిప్' నడిసముద్రంలో ఆగిపోయింది. విశాఖ నుంచి తమిళనాడు పక్కన పుదుచ్చేరికి బయలు దేరిన ఈ భారీ నౌకను అనుమతించేది లేదని పుదుచ్చేరి ప్రభుత్వం స్పష్టం చేయడంతో నడిసముద్రంలోనే అనుమతి కోసం షిప్ ను ఆపివేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఈ క్రూయిజ్ షిప్ సముద్రంలోనే ఉండిపోయింది.
ఇక ఈ భారీ విలాసవంతమైన నౌకను పుదుచ్చేరి అధికారులు ఆపివేయడానికి కారనంగా ఇందులో కేసినో, గ్యాంబ్లింగ్ జరుగుతోందని.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఓడను పుదుచ్చేరిలోకి అనుమతించొద్దని తమిళ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ షిప్ ను అనుమతించడం.. అనుమతించకపోవడంపై తాము స్పష్టంగా ఉన్నామని పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.. అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెలిపారు. అలాంటివేవి లేవని నిర్ధారించుకోవాలన్నారు.
పుదుచ్చేరి సమీపంలో లగ్జరీ షిప్ ను లంగర్ వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. టూరిజంను అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉన్నామని.. కానీ మన సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తమిళిసై స్పష్టం చేశఆరు.
లగ్జరీ క్రూయిజ్ షిప్ ను 2 రోజులు, 3 రోజులు, 5 రోజులుగా ప్లాన్ చేశారు. తమిళనాడు పర్యాటక శాఖ కార్డిలియా షిప్పింగ్ కంపెనీతో కలిసి చెన్నై పోర్టులో ఈ క్రూయిజ్ ను ప్రారంభించారు.
విలాసవంతమైన ఈ క్రూయిజ్ షిప్ లైనర్ చెన్నై నుంచి పాండిచ్చేరి, విశాఖపట్నంకు ప్రజలను విహారయాత్రకు తీసుకెళుతోంది. ఇటీవలే వైజాగ్ లో దీన్ని మంత్రి రోజా ప్రారంభించారు. మరుసటి రోజే ఇది నడిసముద్రంలో అనుమతి లేకుండా ఆగిపోవడం చర్చనీయాంశమైంది.