అడిగిన వెంటనే రెడీ క్యాష్ ఇచ్చే సంపన్నులు ..?

Update: 2023-06-28 10:00 GMT
ఈ మంధ్యనే దేశంలో జరిగిన ఒక సర్వేలో కాస్ట్ లీ సిటీగా విశాఖ పేరు కూడా ఉంది. తొలి పది నగరాల్లో విశాఖ ఉండడం విశేషం.కాస్ట్ లీ సిటీలో ఖరీదైన జనాభాయే ఉంటుంది. విశాఖలో మిలినీయర్లు, మల్టీ మిలీనియర్స్ ఉంటారని అంతా అనుకుంటారు. అది నిజమే అని కూడా సర్వేలు చెబుతున్నాయి.

ఎంతో మంది ధనవంతులు ఉన్న అందమైన నగరం విశాఖ. పాతిక కోట్ల మంది జనాభా ఉంటే పేదలు నిరుపేదలు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలతో పాటు కోట్లకు పడగలెత్తే అపర కుబేరులు కూడా విశాఖలోనే ఉన్నారని అంటున్నారు

అయితే ఈ లెక్క అంతా ఎవరు తీశారు. ఈ రకమైన సర్వే ఎపుడు జరిగింది అన్న చర్చ రావచ్చు. కానీ ఇటీవల పోలీసు శాఖకు తామరతంపరగా వచ్చి పడుతున్న గన్ లైసెన్స్ దరకాస్తులు చూసిన వారికి విశాఖలో ఇంత మంది అపర కుబేరులు ఉన్నారా అన్న పెద్ద డౌట్ వచ్చిందట. ఇటీవల ఏకంగా విశాఖ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలను వారి నుంచి గుంజే ప్రయత్నం చేసిన కిడ్నాపర్లు ఇపుడు కటకటలా వెనక ఉన్నారు.

అయితే వారి చెరలో పడిన  ఎంపీ ఆడిటర్ జీవీ కూడా బాధితుడే. ఆయనను కూడా వారు టార్చర్ చేశారు. జీవీ ఎంవీవీ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఇక జీవీకి మంచి కాంటాక్టులు ఉన్నాయి. దాంతో ఆయన నుంచే విశాఖ అపర కుబేరుల జాబితాను కిడ్నాపర్లు సేకరించరని అంటున్నారు.

విశాఖలో అర్ధరాత్రి అన్నం పుడుతుంది. కానీ అర్జంటుగా పది కోట్లు కావాలంటే రెడీ క్యాస్ కరకరలాడే కరెన్సీ పుడుతుందా అంటే ఎస్ పుడుతుంది అని కిడ్నాపర్లు సేకరించిన లిస్ట్ తో అర్ధం అయిందట. అలా విశాఖలో నోట్ల కట్టలు ఉన్న వారు ఎంతైన సొమ్ము క్షణాల్లో తెచ్చి ఇచ్చే బాపతు బోలెడు మంది ఉన్నారని  అంటున్నారు.

ఇక తమ తదుపరి టార్గెట్ ఎవరు ఏమిటి అన్నది కూడా కిడ్నాపర్లు ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ టైం లోనే రూపొందించుకున్నారని అంటున్నారు. దాంతోనే వారు ఈ లిస్ట్ ని సేకరించారు అని తెలుస్తోంది. ఇలా బడా బాబుల వివరాలు అన్నీ కిడ్నాపర్ల వద్దకు చేరడంతో ఏ క్షణం ఏమి జరుగుతుందో అన్న కంగారుతో బెంగతో చాల అమంది ఎందుకైనా మంచిదని గన్ లైసెన్స్ కి దరఖాస్తు చేసుకున్నారని అంటున్నరు.

ఇక్కడ కిడ్నాప్ ఒక ఆస్పెక్ట్ అయితే దానికి మించిన పరమ సత్యం ఏంటి అంటే విశాఖ నిండా లెక్కకు మిక్కిలిగా కుబేరులు ఉన్నారని, విశాఖ సాగర గర్భంలో రత్నాలు ఎన్ని దాగి ఉన్నాయో తెలియదు కానీ విశాఖలో అపర కుబేర సంతతి వారసులు మాత్రం దండీగా ఉన్నారని ఈ లేటెస్ట్ కిడ్నాప్ ఎపిసోడ్ తేటతెల్లం చేసిందా అంటే అవును అని అంటున్నారు. అలా కూడా విశాఖ గ్రేట్ అనిపిస్తోంది కదూ.

Similar News