స‌బ్బం హ‌రిని విశాఖ న‌మ్మ‌డం లేదా... రీజ‌నేంటి..?

Update: 2021-04-23 02:30 GMT
మాజీ ఎంపీ.. స‌బ్బం హ‌రిని విశాఖ ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదా ? ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను విశాఖ ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటున్నారా?  ఒక ర‌కంగా చెప్పాలంటే.. విదూష‌కుడి మాదిరిగా ఆయ‌న‌ను విశాఖ రాజ‌కీయ నేత‌లు భావిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం..ఆయ‌న‌కు ఒక స్టాండ్ లేక‌పోవ‌డ‌మే..! ఆయ‌న మాట‌లు.. అవ‌స‌రానికి అనుగుణంగా మారిపోతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీలోనే ఉన్నాన‌ని ఆయ‌న చెబుతున్నా.. టీడీపీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య చాలా దూరం న‌డుస్తోంది. విశాఖ‌లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రూ ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

పోనీ.. స‌బ్బం హ‌రికి టీడీపీ సీనియ‌ర్ల‌యినా.. మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారా ? అంటే.. అదీ లేదు.ఇక చంద్ర‌బాబు సైతం ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయన మీడియాలో ఎంత ఊద‌ర‌గొడుతున్నా పార్టీ నేత‌లు లైట్ తీస్కొంటున్నారు. ఇక‌, లోక‌ల్ పాలిటిక్స్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నారు. వైసీపీ నేత‌లను స‌బ్బం హ‌రి.. స్థానికేత‌రుల‌ని.. ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా ప్ర‌చారం చేశారు. నాన్‌లోక‌ల్ లీడ‌ర్లు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నార‌ని.. అప్ప‌ట్లో చెరిగేశారు.

విజ‌య‌సాయిరెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. విశాఖ మ‌నిషి క‌నుక‌.. ఆయ‌న‌కు విశాఖ‌పై ప్రేమ ఉంద‌ని అనుకోవ‌చ్చు. లేదా.. స్థానికేత‌రులు అయిన‌.. వారు వ‌స్తే.. విశాఖ‌ను కొల్ల‌గొడ‌తార‌నే భ‌యం ఉండొచ్చు. సో.. స‌బ్బం వారి లోక‌ల్ మంత్రాన్ని ఇలా అర్ధం చేసుకోవ‌చ్చు. కానీ, ఆయ‌న టంగ్ మాత్రం మారిపోతుంది. త‌న‌కు అనుకూలంగా ఉన్నా.. త‌న ప‌నులు చేసి పెట్టినా.. లేక త‌న‌కు సంబంధించిన మ‌నుషులైనా.. అయితే.. మాత్రం నాన్ లోక‌ల్ నేత‌లు కూడా లోకల్ అయిపోతుంటారు.

ఉదాహ‌ర‌ణ‌కు గ‌త 2019 ఎన్నిక‌లే తీసుకుంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌లు విశాఖ నుంచి పోటీ చేశారు. వీరు నాన్‌లోక‌ల్‌. కానీ, ఆ స‌మ‌యంలో మాత్రం స‌బ్బం హ‌రి మాత్రం సైలెంట్ అయిపోయారు. మ‌రి ఇది నిజ‌మైన ప్రేమేనా?  లేక అవ‌కాశ‌వాద‌మా?  ఇదే.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇదే త‌ర‌హా హ‌రిగారి వ్య‌వ‌హారం ఉండ‌డంతో స్థానికంగా ఆయ‌నపై విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News