ఏపీకి పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. దీన్ని రాష్ట్ర విభజన చట్టంలోనూ హామీనిచ్చారు. కానీ ఇప్పటికీ ఆ రైల్వే జోన్ అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.ఇప్పటికే విశాఖలో ఉన్న ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఇప్పుడు విభజన హామీల్లో ఒకటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పైనా చేతులెత్తేసింది.
ఈరోజు పార్లమెంట్ లో విశాఖ రైల్వే జోన్ పై మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందన చూస్తుంటే ఈ రైల్వే జోన్ కూడా ప్రత్యేక హోదా జాబితాలో చేరిపోయేలా కనిపిస్తోంది.తాజాగా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ లో ఒక ప్రకటన చేశారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన పీయూష్ విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పనిచేస్తున్నారని తెలిపారు.ఆ అధికారి నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. రైల్వే జోన్ పై తుది నిర్ణయానికి ఎలాంటి కాలపరిమితి లేదు' అని పీయూష్ గోయల్ అన్నారు.