జగన్ తల్చుకుంటే జరుగుతుంది కానీ ఎందుకనో వెనుకడుగు వేస్తున్నారు అంతేకాదు ఆయన అనుకుంటే ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం అవుతుంది కానీ ఎందుకనో వద్దనుకుంటున్నారు దీంతో విలువయిన ఆస్తులున్న ఫ్యాక్టరీ ప్రయివేటు వ్యక్తుల చేతికి పోతే కార్మిక కుటుంబాలు రోడ్డున పడడం ఖాయం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేసి సాధించుకున్న ప్లాంటు త్వరలోనే జిందాల్ సొంతం కానుంది.
ఇప్పటికే విశాఖ కేంద్రంగా మైనింగ్ పనుల్లోనూ ఇంకా ఇంకొన్నింటిలో నూ తమ హవా చూపుతున్న కార్పొరేట్ శక్తులకు ఊతం ఇస్తూ మరో కీలక ప్రతిపాదన ఒకటి తెరపైకి రావడంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. కంపెనీ కనుక ప్రయివేటు పరం అయితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో ఎన్ని పోతాయో కూడా చెప్పలేం అని సంబంధిత పోరాట సంఘాలు అంటున్నాయి.
ముఖ్యంగా రాజకీయ శక్తుల చొరవ కారణంగా తమకు మేలు జరగకపోగా కీడే ఎక్కువ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా వీరంతా భయపడిపోతున్నారు.దీంతో స్టీల్ ఫ్యాక్టరీ తమ చేతుల నుంచి జారిపోతే జిందాల్ లాంటి సంస్థలు ఇక్కడున్న అందరికీ ఉపాధి ఇస్తాయన్న గ్యారంటీ అయితే లేదు అని కూడా అంటున్నాయి.
ప్రభుత్వం తల్చుకుంటే ఈ ఫ్యాక్టరీ నష్టాల నుంచి కోలుకోవడం పెద్ద కష్టమేం కాదు.అసలీ నష్టాలు కూడా ఫ్యాక్టరీ స్థాయిని దాటిపోయినవీ కావు. కానీ జగన్ ఎందుకనో ఈ ఫ్యాక్టరీని తీసుకునేందుకు శ్రద్ధ చూపకపోగా, కడప కేంద్రంగా స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు మాత్రం షురూ చేస్తున్నారు.ఇప్పుడివే కీలక వివాదాలకు తావిస్తున్నాయి.
వాస్తవానికి విశాఖ జిల్లా వాతావరణంలో ప్రముఖ కార్పొరేట్ల హవా బాగానే ఉంది.వాళ్లను దాటి పనులు జరగడం లేదు కూడా! కాస్తో కూస్తో పరపతి ఉంటే చాలు పనులన్నీ వాళ్లవే! గంగవరం పోర్టు కూడా అదానీలే దక్కించుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా భావనపాడు కూడా అదానీకే ఇచ్చారు.
ఇవి కాకుండా ఇంకొన్ని కాంట్రాక్టులు కూడా కార్పెరేట్ల చేతిలోనే ఉన్నాయి.రేపో మాపో విశాఖ స్టీల్ అమ్మకంపై స్పష్టత రానుంది. జిందాల్ కంపెనీ దీనిని సొంతం చేసుకోనుందని, ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రతిపాదన వచ్చినా తాము కొనుగోలు చేసేందుకు సిద్ధమేనని పేర్కొంటూ సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అంటే రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోకుండా ఓ ప్రయివేటు కంపెనీకి ధారాదత్తం చేయడం అన్నది ఎంత వరకూ సమంజసం అన్నది ఓ ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వమే తలుచుకుంటే ఈ కంపెనీని సులువుగానే తన సొంతం చేసుకోగలదు. అక్కుడున్న విలువైన భూములు అమ్మైనా కూడా ప్లాంట్ ను పరిరక్షించవచ్చు. అంటే ఓ ప్రభుత్వానికి చేతగానిది ఓ ప్రయివేటు కంపెనీకి ఎలా సాధ్యం అవుతుంది అన్న సంశయాలు కూడా ఇవాళ రేగుతున్నాయి.