త్వరలో పరిపాలన రాజధాని ఏర్పాటు ...అక్కడ ఐకానిక్ బ్రిడ్జి , స్పష్టం చేసిన మంత్రులు
ఏపీలో వైసీపీ సర్కార్ కొలువు దీరిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో అతి ముఖ్యమైన నిర్ణయం .. మూడు రాజధానులు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలని పూర్తిగా మార్చేసింది. అయితే దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. అలాగే కేసులు కూడా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే .. రాజధానిని త్వరలో అమరావతి నుంచి విశాఖకు ఎట్టిపరిస్ధితుల్లోనూ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రాజధాని విశాఖకు తరలిరావడం ఖాయమని, నగరానికి సమాంతరంగా మరో సిటీ రూపుదిద్దుకుంటుందని, అందులో ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఉంటుందని ఒక్కరోజే ఇద్దరు మంత్రులు చేసిన ప్రకటనల అర్థమౌతుంది. ఈ ఏడాది మార్చి తర్వాత ఏ క్షణాన అయినా రాజధాని తరలింపుతో పాటు ఇతర చర్యకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం కోర్టుల్లో నలుగుతున్న రాజధాని వ్యవహారం అతి త్వరలో తేలిపోతుందని ప్రభుత్వ పెద్దల్లో ధీమా కనిపిస్తోంది. దీంతో న్యాయపరమైన చిక్కులు దాటుకుంటూ రాజధానిని తరలిస్తామని వారు చెప్తున్నారు. రాజధాని అమరావతి నుంచి మరికొద్ది రోజుల్లోనే విశాఖకు రానుందని తాజాగా నగరానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ కేంద్రంగా త్వరలో పాలన ప్రారంభం కానుందన్నారు. తన నియోజకవర్గం భీమిలిలోని లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవంతి ఈ వ్యాఖ్యలు చేశారు. అవంతి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వచ్చే నెలలో రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశం వెలువడే అవకాశం కూడా లేకపోలేదు.
త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పిన మంత్రి అవంతి.. అక్కడ ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి వ్యూహాలను కూడా వెల్లడించారు. అటు అనకాపల్లి, గాజువాక నుంచి ఇటు తగరపువలస, భోగాపురం వరకూ మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతుందని అవంతి తెలిపారు. అలాగే భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎస్.కోట, డెంకాడ, భోగాపురం మండలాలతో విశాఖకు సమాంతరంగా మరో నగరం కొత్తగా తయారు కాబోతుంది అని అవంతి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ విశాఖలోనే ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన శంకర్ నారాయణ మరో ప్లాన్ కూడా వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మంచబోయే కొత్త ఎయిర్‌పోర్టును విశాఖతో అనుసంధానించేందుకు రూ.1700 కోట్లతో బీచ్ కారిడార్ నిర్మిస్తామని శంకర్ నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా భీమిలి-భోగాపురం మధ్య ఐకానిక్ బ్రిడ్జి కూడా రాబోతుంది అని అన్నారు.