ట్రంపేమీ నా పెళ్లాం కాదంటున్న పుతిన్

Update: 2017-09-06 04:11 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి రష్యా మీడియా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ వరుస ప్రశ్నలు సంధించడంతో ఆయన సెటైరిక్ కామెంట్లు చేశారు. ‘ట్రంప్‌ ఏమీ నా భార్య కాదు.. నేను ఆయన భర్తనీ కాను’ అని ఆయన అన్నారు.  అలాగే... ‘ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే ఎలా ఉంటుంది?’  అని మీడియా ప్రశ్నించడంతో..  అది చాలా తప్పని అంటూనే అమెరికాతో అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం రష్యాకు ఉందని అన్నారు.  ఇటీవ‌లే అమెరికాలోని రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా ఖాళీ చేయించడం... ప్రతిగా తెలిసిందే. ర‌ష్యా కూడా అదే ప‌నిచేస్తుండ‌డంతో రెండు దేశాల మధ్య వేడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నేషనల్ మీడియాలో పాపులర్ అయ్యాయి.
    
మరోవైపు వరుస అణు పరీక్షలతో ఉద్రిక్తతలు రేపుతున్న ఉత్తర కొరియా విషయంలోనూ పుతిన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా విషయంలో దౌత్యపరమైన పరిష్కారానికి రాకపోతే.. ప్రపంచం పెను విపత్తును ఎదుర్కొనే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. అణు పరీక్షల విషయంలో ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
    
హైడ్రోజన్‌ బాంబును పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశం పట్ల తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఆయన ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించడాన్ని ఖండించారు. అలా అని ఉత్తర కొరియాపై కొత్తగా మరిన్ని ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
Tags:    

Similar News