మ‌రో యుద్ధం ముంచుకువ‌స్తోందంట‌

Update: 2016-10-29 15:21 GMT
భార‌త్‌-పాకిస్తాన్‌ ల మ‌ధ్య క‌మ్ముకున్న యుద్ధ మేఘాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తించి అనంత‌రం స‌ద్దుమ‌ణిగిన విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో స‌మరానికి సిద్ధ‌మ‌న‌ట్లు క‌నిపిస్తోంది. ముదిరిపాకాన ప‌డిన‌ రష్యా - యూరప్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం త్వ‌ర‌లో యుద్ధం రూపం దాల్చ‌నుంద‌ట‌. దాదాపు 3, 30, 000 సైనికుల‌ను యూర‌ప్ స‌రిహ‌ద్దుకు ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంపించ‌డం ద్వారా యుద్ధంపైపు అడుగులు వేస్తున్నారని నాటో అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల‌తో స‌మ‌రం త‌ప్ప‌ద‌న్న‌ట్లుగా ఉంద‌ని చెప్తున్నారు.

అయితే యూర‌ప్ కూటమి దేశాలు ఈ యుద్ధాన్ని ఎదుర్కోగల  స‌త్తాని కలిగి ఉన్నాయ‌ని చరిత్రకారులు - ఆర్మీలో పనిచేసిన మాజీ అధికారులు ధీమాగా చెప్తున్నారు. పుతిన్ ఎత్తుల‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ భ‌య‌ప‌డ‌బోద‌ని వారు ఘంటాప‌థంగా చెప్తున్నారు. అయితేఅలాంటి విప‌రిమాణం సంబంవించ‌కుండా  నాటో అధికారులు ప్ర‌య‌త్నం చేస్తున్నట్లుగా స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News