ఐడియా, వొడాఫోన్ ఇపుడు ఒక్క‌టే

Update: 2017-01-30 16:22 GMT
దేశంలో టెలికాం రంగంలో కొత్త పోటీ నెల‌కొన‌నుంది. టెలికాం దిగ్గ‌జాలు ఐడియా - వొడాఫోన్ త్వ‌ర‌లోనే చేతులు క‌లుప‌నున్నాయి. ఇండియా వ‌ర‌కు వొడాఫోన్‌ను ఐడియాలో విలీనం చేసే దిశ‌గా చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని వొడాఫోన్ స్ప‌ష్టంచేసింది. లాభాల‌ను స‌మంగా పంచుకునేలా డీల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఈ రెండు కంపెనీలు.. దీనివ‌ల్ల పోటీని కూడా త‌ట్టుకోవ‌చ్చ‌ని భావిస్తున్నాయి.విలీనానికి సంబంధించి చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని వొడాఫోన్ ప్ర‌క‌టించ‌గానే.. ఐడియా షేర్లు 29 శాతం మేర పెర‌గ‌డం విశేషం. జియో ధాటిని త‌ట్టుకునేందుకు వొడాఫోన్‌ - ఐడియా చేతులు క‌లుప‌నున్నాయ‌న్న వార్త‌లు చాలా రోజులుగా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ రెండు కంపెనీల‌తో పాటు జియో - ఎయిర్‌ టెల్ మ‌ధ్యే అస‌లు పోటీ ఉంది. ఇప్పుడు ఐడియా - వొడాఫోన్ ఒక్క‌టైతే.. పోటీ త్రిముఖ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే జియోలో ల‌క్ష‌న్న‌ర కోట్ల‌కుపైగా పెట్టుబ‌డి పెట్టిన ముకేష్ అంబానీ.. మిగ‌తా టెలికాం సంస్థ‌ల‌ను గట్టి దెబ్బ‌తీశారు. దీంతో ప్ర‌త్య‌ర్థి కంపెనీలు జియోను త‌ట్టుకునేందుకు ర‌క‌ర‌కాలు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నాయి.

ఈ కొత్త లావాదేవీల గురించి వొడాఫోన్ అధికారికంగా స్పందించింది. ఐడియా మాతృసంస్థ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ తో సంప్ర‌దింపులు న‌డుస్తున్నాయ‌ని వొడాఫోన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. వొడాఫోన్‌ కు ఐడియా కొత్త‌గా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టంచేసింది. అయితే క‌చ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుంద‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇండ‌స్ ట‌వ‌ర్స్‌ లో వొడాఫోన్‌ కు ఉన్న 42 శాతం వాటాతో ఈ విలీనానికి ఎలాంటి సంబంధం ఉండ‌దు. కాగా ఈ ప‌రిణామంతో రెండు కంపెనీల‌కు చెందిన వినియోగ‌దారుల‌కు మ‌రింత మేలైన సేవ‌లు అందుతాయ‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News