మైనర్ బాలిక పై ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వాలంటీర్ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నట్టు ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త ప్రచారంఅవుతుంది . చుండూరు మండలంలోని మున్నంగివారిపాలెం వార్డు వాలంటీర్, అదే మండలానికి చెందిన ఎనిమిదో తరగతి చదివే 14 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటబడుతూ, తన మాయ మాటలతో నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడట.
ఈ విషయంలో బాలిక ఇంట్లో విషయం తెలియడంతో ఆమె తండ్రి మూడు రోజుల క్రితం చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ వలంటీరు చుండూరు తహసీల్దార్ కారు డ్రైవర్ కూడా కావడం, పై అధికారుల ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, కొందరు రాజీ చేసుకోవాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె తండ్రి ఆరోపణలు చేస్తున్నారట. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చే గ్రామ వాలంటీర్లే అఘాయిత్యాలకు పాల్పడితే, ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తమ కూతురికి న్యాయం చేసి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, దీనిపై డీఎస్పీ విచారణ జరిపించారని, వలంటీర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చుండూరు ఎస్ ఐ సుహాసిని చెప్పారు. ఈ కేసు విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని చెప్తున్నారు. వలంటీర్ పవన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.