తెలంగాణ ఎన్నికల సంగ్రామం మహా రంజుగా సాగుతోంది. ఓటర్లను ఆకర్షించడానికి.. అదే సమయంలో ఎన్నికల కమిషన్ కు ఎక్కడా దొరకకుండా ఓటర్లకు బహుమతులు పంచడానికి పార్టీలు పెద్ద ప్లాన్లు వేస్తున్నాయి. ముఖ్యంగా యువతీయవకులు - మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం భారీగా తాయిలాలు ఇస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు కేడర్ కార్యకర్తలకు ప్రతిరోజు బీరు - బిర్యానీ - డబ్బులిస్తూ తిరుగుతున్నారు. ఇప్పుడు బస్తీలు - కాలనీల్లో మెజార్టీ ఓట్లను ఆకర్షించేందుకు వెరైటీ గిఫ్ట్ లు ప్లాన్లు చేస్తున్నారు.
యూత్ కోసం క్రికెట్ కిట్లు - వాలీబాల్ - బాస్కెట్ బాల్ - నెట్స్ - షటిల్ బాట్స్ - టీషర్లులు - కమ్యూనిటి హాళ్లలో క్రీడా పరికరాలు - వస్తువులు అందజేస్తున్నారు. ఇక మహిళల కోసం చీరె - సారెలు - వెండి ప్లేట్లు - కుంకుమ భరిణలు - టిఫిన్ బాక్స్ లు - మిక్సీలు - గ్యాస్ స్టవ్ - బ్యాగులు - అత్యధిక ఓట్లు ఉన్న కుటుంబాలకు కుట్టు మిషన్లు - కలర్ టీవీలు - ఫ్రిజ్ లు కూడా ఇవ్వడానికి సిద్ధం చేశారట..
అయితే ఈసీ డేగకళ్ల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఖర్చును తమ అనుచరగణంతో కొనుగోలు చేయిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో నగదు కొరత నేపథ్యంలో అభ్యర్థులు తమ చేతికి మట్టి అంటకుండా.. పార్టీకి అండగా ఉండే ముఖ్యనేతలు - కార్పొరేటర్లు - మాజీలు - ఫైన్షానియర్లు - బిల్డర్లను ఎన్నికల ఖర్చు - గిఫ్ట్ ల కొనుగోలు వ్యయాన్ని భరించాల్సిందిగా ఒప్పిస్తున్నారట.. వీరికి ఎన్నికలయ్యాక.. ఈసీ నిఘా అయిపోయాక డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారట.. ఇలా ఒక పార్టీ ఒక గిఫ్ట్ ఇస్తే.. మరో పార్టీ రెండు గిఫ్ట్ లు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బహుమతుల పంపిణీకి తెరలేపారు. మరి ఈ నయా ట్రెండ్ తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి లాభం చేకూరుస్తుందో చూడాలి మరి..