గత నెల ‘నోటా’ సినిమా రిలీజవుతుండగా.. ఈ సినిమా వల్ల జనాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని.. ఎన్నికల్లో నోటాకు ఓటేయమనే సంకేతాన్ని ఈ సినిమా ఇస్తే ప్రమాదమని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు కూడా పెట్టారు. అప్పటికి ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. ఐతే ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో స్వయంగా తెలంగాణ మంత్రి నోటాకు ఓటేయమంటూ జనాలకు పిలుపునివ్వడం విశేషం. ఐతే ఈ విషయంలో షరతులు వర్తిస్తాయిలెండి. ఎన్నికల్లో ఎవ్వరికీ ఓటు వేయడం ఇష్టం లేకుంటే నోటాకు వేయమని.. అంతే కానీ ఓటు మాత్రం వెయ్యకుండా ఆగిపోవద్దని కేటీఆర్ అన్నాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మీ ఓట్లు ఎలాగూ టీఆర్ ఎస్ కే వేస్తారు. ఒకవేళ అలా కాకుండా.. మీకు ఇంకో ఆలోచన ఉంటే దాన్ని నేను తప్పుపట్టను. మీకు నచ్చినవారికి ఓటు వెయ్యండి. ఎవరికీ ఓటు వెయ్యడం ఇష్టం లేకపోతే 'నోటా'కి ఓటు వెయ్యండి. అంతేగానీ - ఓటు వెయ్యడం మాత్రం మానెయ్యొద్దు'' అని కేటీఆర్ అన్నాడు. ఓ విద్యా సంస్థలోకి వెళ్ళి - విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మామూలుగా అయితే ఏ రాజకీయ నాయకుడూ నోటాకి ఓటు వెయ్యమని చెప్పడు. అలాంటిది కేటీఆర్ లాంటి అగ్ర నేత ఈ మాట చెప్పడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.