ఓటు వేసేందుకు అడ్వాన్స్‌ బుకింగ్‌?

Update: 2015-06-12 04:26 GMT
ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు (కాలం.. ఖర్మం బాగోలేకపోతే అంతంటే ముందే ఎన్నికలు వచ్చే పరిస్థితి) ఓటర్ల చాలానే ఫిర్యాదులు చేస్తుంటారు. పోలింగ్‌ బూతులకు వెళ్లి గంటల తరబడి ఓటు వేయాల్సి వస్తోందని చెబుతుంటారు. ఓటు వేసే వారికి ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

ఓటర్లు ఓట్లు వేసే అంశంలో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్‌ జరిగే రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో తమకు నచ్చిన సమయంలో.. తీరిక ఉన్న టైంలో ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై దృష్టి సారించింది. ఇందుకోసం ముందుస్తుగా.. ఓటు వేసేందుకు సమయాన్ని బుక్‌ చేసుకునేలా అవకాశం ఇవ్వాలని భావిస్తుంది. ప్రస్తుతం ప్రతిపాదనగా ఉన్న ఈ అంశం.. ఆచరణలోకి వస్తే మాత్రం ఓటు వేసేందుకు అనవసరమైన టైం వేస్ట్‌ను తగ్గించే వీలుంది. మరి.. ప్రతిపాదనలో ఉన్న ఈ అంశం ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి..?

Tags:    

Similar News