ఓటు వేయాలి అంటే నచ్చిన బ్రాండ్ ఇవ్వాల్సిందే!

Update: 2020-01-14 04:59 GMT
ఎన్నికలు ..ఎన్నికలు అంటేనే మందు ఏరులై పారాల్సిందే. నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ఎన్నికల ఫలితాల వరకు ప్రతి చోటా కూడా మందు ముందు ఉండాల్సిందే. లేకపోతె ఆ కిక్కు లెక్కతప్పుతుంది. ఇకపోతే తాజాగా తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. నామినేషన్ వేసిన అభ్యర్థులు డోర్‌ టు డోర్ క్యాంపెయిన్‌ చేస్తూ తాను గెలిస్తే అది పూర్తి చేస్తాను - ఇది ఇప్పిస్తానంటూ వాగ్ధానాలు - హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇది అందరి ముందు చెప్పే మాటలు ...ఇక రాత్రి అయితే, ఓటర్లను ఆకట్టు కోవడానికి - హామీ ఇచ్చిన వారు జారిపోకుండా ఉండడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది నేతలు. ఓ వైపు బిర్యానీ డోర్ టు డోర్ అందజేయడం కుదిరితే అందిరినీ ఓ దగ్గరకు పిలిచి విందు భోజనం ఏర్పాటు చేయడం - మందు బాబులకైతే మద్యాన్ని అందించడం చేస్తున్నారు. ఇక్కడే కొత్త చిక్కు వచ్చిపడిందట అభ్యర్థులకు ఏదో ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నం కాబట్టి తక్కువలో దొరికే బ్రాండ్ మద్యాన్ని అందజేస్తున్నారట.

అయితే, ఓటర్లు మాత్రం ఇదే అదునుగా చూసుకుని.. తమకు ఖరీదైన బ్రాండ్ మద్యం కావాలని చెప్పేస్తున్నారట. అయితే  తాము వ్యాట్ 69 - బ్లాక్ డాగ్ - టీచర్స్ లాంటి బ్రాండ్స్ లిక్కర్‌ నే తాగుతామని - అవి పంపిణీ చేస్తేనే మీ పని జరుగుతుందని బెదిరింపులకే దిగుతున్నారట. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు - మున్సిపాల్టీల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక - అప్పు చేసైనా సరే ఓటర్లు అడిగిన బ్రాండ్ మద్యాన్ని అందజేస్తున్నారట అభ్యర్థులు. 


Tags:    

Similar News