ఏపీలోని కృష్ణాజిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అవసరాలకోసం ఓ వీఆర్వో కాల్ మనీ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేయగా వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ... ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్న గౌస్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత
అప్పు చేశాడు. అయితే ప్రతి నెలా వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు ఆ వడ్డీ మాపియా సృష్టించింది. అంతే కాకుండా తరచూ ఫోన్ లు చేస్తూ చిత్రహింసలు పెడుతుండటంతో తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో గౌస్ ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రూ.25 వేలు తీసుకుంటే, మూడు లక్షలు చెల్లించమంటున్నారంటూ.. సూసైడ్ లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్‌లో వడ్డీ వ్యాపారుల పేర్లు ప్రస్తావించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలోనే చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా , ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలు తీసుకునేలా వేధింపులకు గురిచేసిన వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గౌస్ మృతిపట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొండపల్లి పోలీసులు తెలిపారు.