ఆఫీసుకు , ఇంటికి తేడా తెలియకుండా ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే మసాజ్ చేయించుకున్నాడు ఓ వీఆర్వో.. మహిళా వలంటీర్లు - సచివాలయ సిబ్బంది కార్యాలయంలో ఉండగానే వీఆర్వో భాస్కరరావు మసాజ్ తో రిలాక్స్ అయ్యాడు. ఈ వీడియోను అక్కడి వారు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. మీడియాలోనూ వచ్చింది.
దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సదరు వీఆర్వోనును సస్పెండ్ చేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా వేలంక సచివాలయంలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామ సచివాలయంలో భాస్కరరావు వీఆర్వో గా పనిచేస్తున్నారు. ఆఫీసులో మహిళా వలంటీర్లు - ఇతర సిబ్బంది ఉండగానే మసాజ్ చేస వ్యక్తిని పిలిపించుకొని ప్రభుత్వ కార్యాలయంలో మసాజ్ చేయించుకున్నాడు. దీనిపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీఆర్వో తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్థానిక అధికారులు సైతం వీఆర్వోపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో కలెక్టర్ స్పందించి వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు.