ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి. రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ దిగ్గజ నేతలలో ఒకరుగా మెలిగారు. ముఖ్యంగా వైఎస్సార్ కి అత్యంత సన్నిహితులైన సహచరులలో ఒకరిగా తుదికంటా నిలిచారు. అలాంటి ఉండవల్లి రాజకీయాలు వద్దు అంటూ స్వస్తివాచకం పలికారు కానీ వర్తమాన రాజకీయాల మీద ఆయన తనదైన శైలిలో మాట్లాడుతూ ఏలికలకు కరకు హెచ్చరికలు జారీ చేయడంలో మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.
నా స్నేహితుని కొడుకు ముఖ్యమంత్రి అయితే నేను సంతోషించనా అంటూ జగన్ గురించి మాట్లాడిన ఉండవల్లి కొన్నాళ్ళుగా జగన్ మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు. జగన్ పరిపాలన తనకు అర్ధం కావడం లేదని కూడా ఆయన సెటైర్లు వేశారు. ఏపీ అప్పుల కుప్ప అని కూడా కామెంట్స్ చేశారు. జగన్ గుండె ధైర్యం ఏంటో ఇన్నేసి అప్పులను చేస్తున్నారు అని కూడా అన్నారు.
ఏపీ భవిష్యత్తు తలచుకుంటే భయమేస్తోందంటూ ఉండవల్లి చేస్తూ వస్తున్న కామెంట్స్ ఏపీ జనాలలో ఆలోచనలలో పడవేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉండవల్లి లేటెస్ట్ గా ఒక బాంబు లాంటి కామెంట్ చేశారు. అదేంటి అంటే తాను బతికి ఉండగా పొలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు అని. ఇది నిజంగా జగన్ సర్కార్ కి లైఫ్ టైమ్ హాట్ కామెంట్ గా చూడాలని అంటున్నారు.
ఎప్పటి పోలవరం, ఎప్పటికీ పూర్తి కాని పోలవరం అంటూ ఉండవల్లి అంటున్న మాటలు, చేస్తున్న విమర్శలు అన్నీ కూడా జగన్ కే నేరుగా తాకుతున్నాయి. అన్ని అనుమతులూ వైఎస్సార్ హయాంలోనే వచ్చేశాయని ఇక ఆయన పోయి పదమూడేళ్ళు గడచినా ఇప్పటికీ పోలవరం పూర్తి కాకపోవడం ఏంటి అని ఉండవల్లి సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఆయన ఒక దశలో జగన్ సర్కార్ మీద తీవ్ర అసహనం ప్రదర్శించారు. పోలవరం ఎపుడు పూర్తి అవుతుందో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటనకు ధీటుగా సరైన కౌంటర్ గా ఇపుడు ఉండవల్లి చేసిన కామెంట్ ఏంటి అంటే తాను బతికి ఉండగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడాన్ని చూడలేను అని. మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవదు అని ఉండవల్లి చెప్పకనే చెప్పేశారు అనుకోవాలేమో.
ఇక డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి కారకులు ఎవరు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అని కూడా ఉండవల్లి ప్రశ్నల వర్షమే కురిపించారు. వైసీపీ సర్కార్ గతంలో తాను చెప్పిన మాటలనే చెబుతోందని, ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు అన్న తన మాటలనే మంత్రి అంబటి చెప్పడాన్ని తాను అభినందిస్తున్నాను అని కూడా అన్నారు.
మొత్తానికి చూస్తే జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ కట్టడంలో ఘోరంగా విఫలం అయింది అని ఆయన తేల్చేశారు. ఇది ఎప్పటికీ పూర్తి కాని ప్రాజెక్ట్ అని కూడా జోస్యం చెప్పేశారు. మరి ఈ కామెంట్స్ ని వైసీపీ నేతలు ఎలా జీర్ణించుకుంటారో చూడాలి.