ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆయన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు.. ఆయన నీలి రంగు వ్యాగన్ ఆర్ కారు గుర్తుకు రాక మనదు. ఇంతకాలం పార్టీ అంతర్గత విభేదాల గురించి వార్తలు వచ్చిన స్థానే.. ఇప్పుడు సదరు నీలి రంగు కారుకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.
కేజ్రీవాడే నీలిరంగు కారు బ్రిటన్‌లోని ఒకప్పటి ఆప్ అభిమాని కుందన్ శర్మదంట. ఆయనకు కేజ్రీ మీద కోపం వచ్చేసింది. తాను గతంలో ఇచ్చిన కారు.. తాను.. తన భార్య కలిసి పార్టీకి ఇచ్చిన విరాళాలు తిరిగి వెనక్కి ఇచ్చేయని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఎందుకలా? అంటే.. ఆమ్‌ఆద్మీ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాల్ని చూసిన తర్వాత.. తన మనసు మారిపోయిందని.. తాను ఇచ్చినవన్నీ తనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయినా.. ఇదేమైనా చిన్నపిల్లల ఆట. నీకు అప్పుడెప్పుడో ఇచ్చిన చాక్లెట్ తిరిగి ఇచ్చేయమని.. కోపం వచ్చినప్పుడు పిల్లలు పోట్లాడుకున్నట్లే.. ప్రేమతో ఇచ్చిన కారు.. విరాళం తిరిగి ఇచ్చేయమనటం సమంజసమేనా? మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సదరు డబడబా అని శబ్ధం చేసే ఈ కారును ఈ మధ్యనే తన పార్టీకి చెందిన అశుతోష్‌కు ఇచ్చేశారు. ఇంతకీ సదరు నీలి రంగు కారు ఎప్పడిదో తెలుసా? 1999లో రిజిష్టర్ అయ్యింది. మరి.. తాజా డిమాండ్‌పై కేజ్రీ ఏమంటారో..?