బీజీపీ - విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించేలా బీజేపీ ఎంపీ ప్రవర్తించారని ప్రకాష్ రాజ్ కోర్టు మెట్లెక్కాడు. అంతేకాదు తన గురించి నెగిటీవ్ గా మాట్లాడినందుకు రూ.1 పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ప్రకాష్ - పీఎం మోడీని పలుమార్లు విమర్శించారు. త్వరలో కర్నాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ బెంగళూరులో ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మోడీపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. 2014లో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ రైతులు - నిరుద్యోగుల మోముల్లో చిరునవ్వు తీసుకురాలేకపోయిందని, మరి ఇప్పుడు మరోసారి అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్‌ను నమ్ముతారా అంటూ ట్వీట్ చేశారు.
జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ఆయన తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై అలాగే మోడీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మోడీ తనకంటే గొప్ప నటుడని వెంటనే మౌనం వీడాలని అన్నారు.
గత ఏడాది నవంబర్ లో నోట్ల రద్దు విషయం దేశ ప్రజలను చాలా ఇబ్బందికి గురిచేసిందని అది చాలా పెద్ద తప్పు అని ప్రకాష్ చెప్పారు. అంతే కాకుండా వెంటనే ప్రజలకు క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపోతే నల్ల ధనాన్ని ధనికులు చాలా వరకు వైట్ మనీ గా మార్చుకున్నారని తెలుపుతూ.. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు చేరకుండా చేసేందుకే గత సంవత్సరం పెద్దనోట్ల రద్దును చేశానని మోడీ చెప్పుకున్నారని ప్రకాశ్ రాజ్ వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వలన సామాన్యులే ఎక్కువగా కష్టాలు పడ్డారని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రకాష్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కొడుకు చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా ప్రకాష్ రాజ్ ఓ డ్యాన్సర్ తో పారిపోయి చిందులు వేశారని ఆరోపించారు. ఇలాంటి మానవత్వం లేని వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఎలా ప్రశ్నిస్తారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో మండిపడ్డారు.
ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ విలన్ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ప్రకాష్ రాజ్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తనను వ్యక్తిగతంగా విమర్శించి తన పరువుకు భంగం కలిగేలా చేశారని మైసూరు కోర్టును ఆశ్రయించారు. తన పరువుపోవడానికి కారణం అయిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి రూ. 1 పరిహారం ఇప్పించాలని ప్రకాష్ రాజ్ కోర్టులో మనవి చేశారు.