ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ టికెట్ హాట్ కేకు. ఎంపీ సీటు అయినా.. ఎమ్మెల్యే సీటు అయినా లక్షలు, కోట్లు పోసి కొనుక్కునేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. అలాంటి పిలిచి సీటు ఇస్తానన్న కూడా ఓ అభ్యర్థి తనకు వద్దు అని కాలదన్నడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హోరు కొనసాగుతోంది. బీజేపీ వర్సెస్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. అక్కడ టికెట్ల కోసం ఫైట్ మొదలైంది.
ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ తన పార్టీ తరుఫున పోటీచేసే వారందరి జాబితాను ఒకేసారి విడుదల చేసి బరిలోకి దిగారు. ఇక తాజాగా గురువారం బీజేపీ 157 మందితో రెండో జాబితా ప్రకటించింది.
అయితే అందులో దివంగత కాంగ్రెస్ నేత సోమన్ భార్య అయిన శిఖామిత్రాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే దాన్ని ఆమె తిరస్కరించడం గమనార్హం. విలేకరులతో మాట్లాడిన శిఖా ‘అనుమతి లేకుండా బీజేపీ నా పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందని.. నేను ఏ ప్రాంతం నుంచి పోటీ చేయట్లేదు’ అని పేర్కొన్నారు.
కాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు జరుగనున్నాయి. ఇప్పటికే మమతా, మోడీషాలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.