గోవా వెళ్లాలనుకుంటున్నారా .. అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే !

Update: 2021-06-25 12:30 GMT
పర్యాటకరంగం కరోనా వైరస్ మహమ్మరి దెబ్బకి కుదేలైంది.కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుండి పర్యాటక రంగం పూర్తిగా క్లోజ్ అయ్యింది. మొదటి వేవ్ తగ్గిన తర్వాత కొన్ని పర్యాటక ప్రదేశాలు ఓపెన్ అయినప్పటికీ , మళ్లీ సెకండ్ వేవ్ విజృంభణ తో మూతబడ్డాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే పర్యటక స్థలాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గోవా టూర్‌ వెళ్లే వారికి కొత్త నిబంధనలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం.

గోవా కి రావాలి అని అనుకునే వారు, తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుని ఉండాలని, దీనితో పాటుగా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ రిపోర్టు నెగిటివ్‌ తో గోవా లోకి అడుగుపెట్టాలని మంత్రి మైఖెల్‌ లోబో అన్నారు.  జులై వరకూ వెయిట్ చేసి కేసుల సంఖ్య జీరో అయ్యాకే ప్రోపర్ స్క్రీనింగ్ వాడి రీ ఓపెన్ చేస్తాం. వ్యాక్సిన్ రెండు డోసులు, నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే కరోనా పరిస్థితి సద్దుమణిగే వరకు వేచి చూడాలని, ఒక నెల పాటు తగ్గుతూ ఉంటే బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఈ నిబంధనలు న్యూ ఇయర్, క్రిష్టమస్ వరకూ కంటిన్యూ చేస్తామని చెప్పడం లేదని అన్నారు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి ప్రొటోకాల్స్ కు మార్పులు చేసి టూరిస్టులకు ఇబ్బంది లేకుండా చేస్తామని లోబో తెలిపారు. ఇంతలోనే కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌ పొరుగు రాష్ట్రాలు కేసులను నివేదించిన నేపథ్యంలో గోవా ప్రభుత్వం మహారాష్ట్ర పక్కనే ఉన్న సరిహద్దులో నిఘా పెంచింది. ఇది చాలా అంటు వ్యాధిగా పరిగణించబడుతుందని తెలిపింది. గోవాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ను గుర్తించినందున సరిహద్దు వెంబడి నిఘా వేగవంతం చేశామని, డెల్టా వేరియంట్‌ కేసుల్లో 21 ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే అన్నారు. విమానాల్లో వచ్చిన వారిని, రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించడం చాలా ముఖ్యం. గతేడాది 3వేల 22మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనావైరస్ ప్రభావానికి ఎవరూ గురికాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రమాదానికి గురికావడానికి ఎటువంటి అవకాశాలు ఇవ్వదలచుకోలేదు. ఒకవేళ వైరస్ విజృంభిస్తే చాలా కుటుంబాలు నష్టపోతాయి.
Tags:    

Similar News