పశ్చిమ ఆసియాలోని అజర్ బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. రష్యా జోక్యంతో తాజాగా శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఒప్పందాలను ఉల్లంఘించి మరోసారి కాల్పులు జరుపుకోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లలో తలదాచుకుంటున్నారు.
ఈ రెండు దేశాల మధ్య నగార్నో-కరాబక్ ప్రాంతాల కోసం రెండు దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఆర్మేనియా యుద్ధ సాధనాలపై దాడులు చేస్తున్న అజర్ బైజాన్ డ్రోన్ల వీడియోలు బయటకొచ్చాయి. రెండు దేశాల మధ్య మూడు దశాబ్ధాల నుంచి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆ ప్రాంతాల కోసం మరోసారి పెరిగాయి.
ఈ యుద్ధంలో అజర్ బైజాన్ దేశానికి పక్కనే ఉన్న టర్కీ దేశం సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. టర్కీ బయ్రాక్ తర్ డ్రోన్లను అజర్ బైజాన్ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
యుద్ధం నేపథ్యంలో రెండు దేశాలు ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకున్నాయి. అజర్ బైజాన్ ఎక్కువ ఆయుధాలను సిద్ధం చేసింది. టర్కీ నుంచి డ్రోన్లను అజర్ బైజాన్ కొనుగోలు చేసింది.ఇజ్రాయిల్ డ్రోన్లను అజర్ బైజాన్ కొనుగోలు చేసి వాడుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆర్మేనియా దేశం మాత్రం ఎలాంటి డ్రోన్లను కొనుగోలు చేయలేదని రష్యా తెలిపింది. అయితే స్వల్ప దూరాల్లో లక్ష్యాలను చేధించే క్షిపణులను ఆర్మేనియా తాజాగా రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇవి డ్రోన్లపై బాగా పనిచేస్తాయి.
ప్రస్తుతం ఈరెండు దేశాల మధ్య యుద్ధంతో ప్రజలు భిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుండగా.. పశ్చిమ ఆసియాలో అశాంతి నెలకొంది. రష్యా దేశం వీటి మధ్య శాంతికి పాటుపడుతోంది.